తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఇది మంచు ఫ్యామిలీకి డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. మంచు విష్ణు ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టు గురించి చెబుతూ వచ్చాడు. ఎట్లకేలకు గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. వంద కోట్లకు పైగా బడ్జెట్లో, భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తోంది టీం. మంచు విష్ణుకు చాలా ఏళ్లుగా సరైన విజయం లేకపోయినప్పటికీ.. ఈ సినిమా తన కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నాడు. మొత్తం విదేశాల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి.. గట్టిగా సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా ప్రణాళికలు వేసుకున్నాడు.
జూన్ 14న టీజర్ బాగా హడావుడి మధ్య రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ముఖ్య పాత్రల గురించి సోమవారం సోమవారం పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాను వార్తల్లో నిలిపే ప్రయత్నం చేసింది టీం. కానీ ఈ మధ్య ‘కన్నప్ప’ టీం నుంచి సౌండ్ లేదు. దాదాపు నెల రోజుల నుంచి ‘కన్నప్ప’ టీం నుంచి ఏ అప్‌డేట్ లేదు. ఈ చిత్రాన్ని డిసెంబరులో రిలీజ్ చేస్తామని మంచు విష్ణు గతంలో తెలిపాడు. అందుకు అనుగుణంగానే ప్రమోషన్లు చేస్తూ వచ్చారు.
రిలీజ్ దగ్గర పడుతుంటే ఇంకా ప్రమోషనల్ హడావుడి పెంచుతారనుకుంటే.. టీం ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయింది. మరి సినిమాను విడుదలకు రెడీ చేసే క్రమంలో టీం దాని మీదే ఫోకస్ పెట్టి ప్రమోషన్లను పట్టించుకోవడం లేదా.. లేక డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనను మానుకుని సైలెంట్ అయ్యారా అన్నది తెలియడం లేదు. డిసెంబరులో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ‘కన్నప్ప’ రిలీజ్ గురించి టీం ఏదో ఒకటి త్వరగా తేల్చేయడం బెటర్.
This post was last modified on October 31, 2024 6:57 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…