Movie News

‘కథ అవసరం లేదు’ కామెంట్లపై వివరణ

ఇటీవల రకరకాల వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఫైట్లు, డ్యాన్సులు, హీరో ఎలివేషన్లు ఉంటే సరిపోతుందని.. కథ, తొక్క, తోలు అంటూ ఎవరూ పట్టించుకోరని ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై చాలామంది వంశీని తప్పుబట్టారు.

నాగవంశీ ప్రొడ్యూస్ చేసిన ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఉదాహరణగా చూపించి.. కథ గురించి పట్టించుకోలేదు కాబట్టే ఆ సినిమా పోయిందని కౌంటర్లు వేశారు. ఐతే తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా నాగవంశీ స్పందించారు.

తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు కొన్ని మూమెంట్స్ కోసమే వస్తారని ఆయన చెప్పారు.

‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ హెలికాఫ్టర్ నుంచి జెండా ఊపే సన్నివేశం చూడగానే.. ఆ ఒక్కదానికి టికెట్ డబ్బులు గిట్టుబాటు అయిపోయినట్లు తనకు అనిపించిందని.. ఒక స్టార్ హీరో సినిమా నుంచి అంతకంటే ఏం కావాలని నాగవంశీ అన్నారు.

ఇక లేటెస్ట్ మూవీ ‘దేవర’ గురించి ప్రస్తావిస్తూ.. ఆ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్‌లో ఎన్టీఆర్ అందరినీ చంపేశాక తన కత్తికి అంటుకున్న రక్తాన్ని నీటితో కడుగుతాడని.. ఆ సన్నివేశానికి అనిరుధ్ ఇంగ్లిష్ పాటతో ఆర్ఆర్ చేశాడని.. అది గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్ అని.. అలాంటివి అభిమానులకు ఎంతగానో నచ్చుతాయని.. ఇలాంటి హై ఇచ్చే మూమెంట్స్ కోసమే ఫ్యాన్స్ సినిమాలకు వస్తారని నాగవంశీ అన్నారు.

అభిమానుల సంగతి పక్కన పెడితే కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, వాళ్లు కథ గురించి ఆలోచించరా అని అడిగితే.. వాళ్లకు కూడా క్లారిటీ ఉంటుందని, కొన్ని లెక్కలు ఉంటాయని.. వాళ్లకు కావాల్సింది ఇస్తే సరిపోతుందని నాగవంశీ అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on October 30, 2024 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డేంజర్ బెల్స్ మ్రోగించిన అఖండ 2

బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…

21 minutes ago

అన్నగారికి కొత్త డేట్?

డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…

37 minutes ago

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

53 minutes ago

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…

1 hour ago

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

3 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

5 hours ago