కెజిఎఫ్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా, సుదీర్ఘ విరామం గురించి అభిమానుల వైపు నెగటివ్ కామెంట్స్ వినిపించుకోకుండా యష్ ఎంపిక చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ మాఫియా డ్రగ్ డ్రామాలో నయనతార కీలక పాత్ర పోషిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇటీవలే ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వచ్చినా సరే యష్ దాటవేశాడు తప్పింది నిర్ధారణ చేయలేదు. ఇక్కడిదాకా బాగానే ఉంది కదా.
తాజాగా టాక్సిక్ ఒక వివాదంలో చిక్కుకుంది. బెంగళూరు పరిధిలోకి వచ్చే పీన్య ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ ని ప్లాన్ చేశారు. ఇటీవలే అక్కడి పర్యటనకు వచ్చిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే వేలాది చెట్లు నరికి వేయబడి ఉండటం చూసి అవాక్కయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంతటి దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారని కనుక్కుంటే టాక్సిక్ సెట్ల కోసం ఆ ప్రాంతాన్ని చదును చేశారని తెలిసింది. 599 ఎకరాల్లో విస్తరించి ఉన్న పీన్య – జాలల్లి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే హిందూస్తాన్ మెషీన్ టూల్స్ అనే సంస్థకు కట్టబెట్టారనే కాంట్రావర్సి ఇప్పటికే ఉంది.
ప్రస్తుతం దీని మీద విచారణ జరిపించాల్సిందిగా ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు. గతంలోనూ ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని ఇతర అవసరాలకు, షూటింగులకు అద్దెకు ఇచ్చారని, టాక్సిక్ బృందం పెద్ద ఎత్తున చెట్లు నరకడం వల్ల బయట పడిందని శాండల్ వుడ్ రిపోర్ట్. శాటిలైట్ ఇమేజెస్ లో ఇది స్పష్టంగా కనిపించడంతో వ్యవహారం దూరం వెళ్లేలా ఉంది. నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల చేయాలని తొలుత అనుకున్నారు కానీ తర్వాత వాయిదా వేసుకున్నారు. అదే డేట్ ప్రభాస్ ది రాజ్ సాబ్ కొన్ని వారాల క్రితం అఫీషియల్ గా తీసేసుకుంది.
This post was last modified on October 30, 2024 10:19 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…