ఇంకా షూటింగ్ మొదలుకాకుండేనే కేవలం లొకేషన్ హంట్ తోనే తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం రాజమౌళికే సాధ్యం. ప్రస్తుతం ఆఫ్రికన్ సఫారీలో చక్కర్లు కొడుతున్న జక్కన్న అడవుల్లో రౌండ్లు వేస్తున్న వీడియోలు, జంతువుల ఫోటోలతోనే ఎక్కడ లేని ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తున్నారు.
మహేష్ బాబు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టం కానీ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ పిక్స్ కే అభిమానులు ఊగిపోతున్నారు. ఇవాళ దర్శకధీర ఒక సింహం ఫోటో ముందు నిలబడి వెనుక నుంచి తాను కనిపించేలా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్.
ఆ సింహం వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. దీని పేరు బాబ్ జూనియర్. సుప్రసిద్ధ సెరెంగెటి నేషనల్ పార్క్ లో తిరుగుతూ సంవత్సరాల తరబడి సందర్శకులకు గొప్ప అనుభూతి ఇచ్చేది. అత్యంత ఆకర్షణీయమైన ఫోటో జెనిక్ ఫేస్ కలిగిన మృగరాజుగా దీని ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
జమైకన్ గాయకుడు బాబ్ మార్లే స్మారకంగా దీనికా పేరు పెట్టారు. అయితే ఓ రోజు అనుకోకుండా శత్రువులుగా భావించే తన కన్నా చిన్నవైన సింహాల చేతుల్లో బాబ్ జూనియర్ హత్యకు గురయ్యింది. తమ్ముడిగా భావించే ట్రైగ్వె అనే మరో సింహం కూడా అదే ఘటనలో ప్రాణాలు వదిలింది.
ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు నెటిజెన్లు సృష్టిస్తున్న స్టోరీ ఏంటంటే బాబ్ జజూనియర్ ప్రాణాలు వదిలాక దాని ఆత్మ మహేష్ బాబుని ఆవహిస్తుందట. తన చావుకు కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఒక నిధికి సంబంధించిన వేట కీలకంగా ఉంటుందట. క్రియేటివిటీ బాగుంది కదూ.
విజయేంద్ర ప్రసాద్ వింటే ఏమైపోతారో కానీ ఇప్పుడీ బాబ్ జూనియర్ ఫోటోని మహేష్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. ఇదే తమ హీరో ఫస్ట్ లుక్ అని, ఇకపై ఏదైనా విడుదల చేసే ముందు ప్రీ అనౌన్స్ మెంట్ ఇవ్వాలని ఎలివేషన్లు ఇస్తున్నారు. అంచనాలు అలా ఉన్నాయి మరి.
This post was last modified on October 30, 2024 6:44 pm
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…