ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ ఒకటి అనుకున్నప్పుడు వెంటనే దాన్ని ప్రకటించేయాలి. లేదూ ఆలోచిద్దాం అంటూ మీనమేషాలు లెక్కేస్తే ఇంకొకరు ఎగరేసుకుపోతారు. అలాంటిదే ఒకటి జరిగింది.
జనవరి 10 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభరని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త తేదీని అనౌన్స్ చేయకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. కానీ అనఫీషియల్ గా టీమ్ చెప్పిన మాటలను బట్టి మే 9 లాక్ చేయొచ్చని అన్నారు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి ఆడిన బ్లాక్ బస్టర్ డేట్ ఆది.
తీరా చూస్తే రోజులు గడిచాయి కానీ ట్రైలర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ చూసి విశ్వంభర టీమ్ సైలెంట్ అయ్యింది. ఈలోగా రవితేజ బృందం స్ట్రాటజీ అమలు పరిచింది.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సామజవరగమన రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సినిమాకి మాస్ జాతర టైటిల్ ని లాక్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ఇడియట్ లోని ఫేమస్ డైలాగు మనదే ఇదంతాని క్యాప్షన్ గా పెట్టారు. 2024 మే 9 నుంచి థియేటర్లలో జాతర ఉంటుందనే రీతిలో రవితేజ ఫ్రెష్ స్టిల్ ఒకటి వదిలారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ ధమాకాని మించి ఉంటుందని సమాచారం.
నిజానికీ మాస్ జాతరని సంక్రాంతికే అనుకున్నారు. అయితే షూటింగ్ లో రవితేజ గాయపడటంతో మూడు నెలలు బ్రేక్ పడింది. ఇటీవలే తిరిగి మొదలుపెట్టారు. అయితే ఆరోగ్యం దృష్ట్యా వేగంగా పరుగులు తీయకుండా చక్కని ప్లానింగ్ తో మెల్లగా పూర్తి చేసేలా సెట్ చేసుకున్నారు. వరస ఫ్లాపులతో డీలా పడ్డ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా మాస్ జాతర రూపొందుతోందట.
హిలేరియస్ గా నవ్వించడంతో పాటు మాస్ ని ఆకట్టుకునే యాక్షన్ బ్లాక్స్ బోలెడు ఉంటాయట. సరే ఏదైతేనేం అన్నయ్య చిరంజీవి కోరుకున్న డేట్ ని తమ్ముడు రవితేజ తీసేసుకున్నాడు. మరి విశ్వంభర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on October 30, 2024 4:53 pm
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…