Movie News

యంగ్ హీరో వెనుక ఇంత కష్టం ఉందా?

సినీ పరిశ్రమలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి ఒక స్థాయికి ఎదగడం, అవకాశాలు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఇలా రైజ్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు.

రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో అతను మంచి గుర్తింపు తెచ్చుకుని వరుసగా అవకాశాలు చేజిక్కించుకున్నాడు. కానీ తర్వాత చేసిన చిత్రాల్లో కొన్ని దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో కెరీర్ కొంచెం డౌన్ అయింది.

ఇప్పుడు తన నుంచి వస్తున్న ‘క’ మూవీ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కిరణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తనను ట్రోల్ చేసే వారి గురించి ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు.

సినిమా పేరు చెప్పలేదు కానీ.. ‘బాయ్స్ హాస్టల్’ అనే సినిమాలో తన మీద కౌంటర్లు వేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన నేపథ్యం గురించి అతను వివరించినపుడు అందరికీ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ కుర్రాడి వెనుక ఇంత కష్టం ఉందా అనిపించింది.

కిరణ్‌ది కడప జిల్లా రాయచోటి దగ్గర ఓ పల్లెటూరు. తన తల్లి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చే సమయానికి వాళ్లకు ఆస్తులేమీ లేవట. అప్పులు మాత్రమే ఉన్నాయట. కిరణ్ తల్లి కూలికి వెళ్లేదట. ఒక దశలో మెడలో తాళి కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందట.

ఆ ఊరిలో చాలామంది గొర్రెలు మేపుకునేవాళ్లే ఉండడంతో తన ఇద్దరు కొడుకులు కూడా గొర్రెలు మేపుకోక తప్పని పరిస్థితి వస్తుందేమో అని ఆమె భయపడిందట. దీంతో కిరణ్ పాలు తాగే వయసులో తనతో పాటు కుటుంబాన్ని వదిలేసి కువైట్ వెళ్లి అక్కడ 20 ఏళ్ల పాటు అనేక పనులు చేసి డబ్బులు సంపాదించిందని.. అలా తమ కుటుంబం నిలబడిందని కిరణ్ తెలిపాడు.

తన యుక్త వయసు వచ్చే వరకు తన తల్లితో రెండేళ్లకు మించి గడపలేదని కిరణ్ చెప్పాడు. తల్లి సంపాదనతో 4 లక్షలు పెట్టి 2004లో రాయచోటిలో ఓ ఇల్లు కూడా కొన్నామని.. కానీ ఆమె తిరిగి ఇక్కడికి వచ్చేశాక 2015లో మళ్లీ ఆ ఇంటిని అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చిందని కిరణ్ వెల్లడించాడు.

కాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన సమయంలో ఇంకా ఏదైనా సాధించండి అని చెప్పిన తన తల్లి మాటతో తాను ఆలోచనలో పడి.. నటన వైపు అడుగులేశానని.. షార్ట్ ఫిలిమ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నానని.. ఆపై హీరోగా అవకాశాలు అందుకున్నానని.. తన జర్నీ గురించి వివరించాడు కిరణ్. ఈ మాటలు విన్నాకే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య.. కిరణ్ జర్నీకి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పడం విశేషం.

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago