నందమూరి కుటుంబం నుంచి ఇంకో హీరో వస్తున్నాడు. హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇది కొన్ని నెలల క్రితమే ప్రకటించినప్పటికీ కుర్రాడి లుక్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.
ఒకప్పుడు దేవదాస్ లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వైవిఎస్ చౌదరి చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా కొంచెం పీరియాడిక్ టచ్ తో అంచనాలకు మించి ఎన్టీఆర్ ని లాంచ్ చేస్తానని ఆయన ప్రత్యేకంగా చెబుతున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు.
పరిచయ వీడియోని వైరెటీగా డిజైన్ చేశారు. కోర్టులో ప్రమాణం చేసే తరహాలో నందమూరి లెగసిని కాపాడుతూ, తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాల్లో నటిస్తూ, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ హీరో వాయిస్ ఓవర్ తో చెప్పించడం బాగుంది.
అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఉండగా అదే పేరుతో మరో ఎన్టీఆర్ రావడం విశేషమైతే అన్న కొడుక్కు శుభాకాంక్షలు చెబుతూ స్వయంగా తారకే ఎక్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేయడం ఇంకో విశేషం. లుక్స్ చూస్తుంటే కొత్త ఎన్టీఆర్ మరీ సాఫ్ట్ గా లేదు. కమర్షియల్, మాస్, యాక్షన్ సినిమాలకు అనుగుణంగా వైవిఎస్ చౌదరి బలమైన శిక్షణ ఇప్పించాడు.
ఇతర తారాగణం, సాంకేతిక బృందం తదితర వివరాలు చెప్పలేదు కానీ త్వరలోనే ప్రకటించబోతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఆ ఫ్యామిలీలో ఆ పేరు నిలబెట్టేంత స్థాయికి వెళ్ళింది బాలకృష్ణనే, తారకరత్న గ్రాండ్ గా పరిచయమైనా తర్వాత మానేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక హఠాత్తుగా కన్నుమూయడం విషాదం.
కళ్యాణ్ రామ్ తనదైన మార్కెట్ సృష్టించుకోగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, దేవరలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ ని బలోపేతం చేసుకున్నాడు. మోక్షజ్ఞ త్వరలోనే పరిచయం కాబోతున్న నేపథ్యంలో అంతకన్నా ముందుగా వస్తున్న న్యూ ఎన్టీఆర్ ఎలా అలరించబోతున్నాడో వేచి చూడాలి.
This post was last modified on October 30, 2024 3:45 pm
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…