Movie News

ఇది అనుష్క సినిమానా.. అంజలిదా?

కొందరు దర్శకులు, రచయితలకు కొందరు హీరోయిన్లపై ప్రత్యేక అభిమానం ఉంటుంది. వాళ్లను తరచుగా తమ సినిమాల్లో పెట్టుకోవడం.. వాళ్ల ప్రత్యేకత ఉండేలా చూసుకోవడం.. సాధ్యమైనంత ఎక్కువ రన్ టైం ఇవ్వడానికి చూడటం చేస్తుంటారు. ఒకప్పుడు సీనియర్ నటి శారద మీద పరుచూరి సోదరులు ఇలాంటి అభిమానమే చూపేవాళ్లు. వాళ్లు రచయితలుగా పని చేసిన చాలా సినిమాల్లో శారద ప్రత్యేక పాత్రల్లో మెరిశారు.

ఐతే అప్పట్లో కాంబినేషన్లు రిపీట్ చేయడం మామూలు విషయమే కానీ.. ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. ఒక కాంబినేషన్లు రెండు మూడు సినిమాలొస్తేనే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. ఇలాంటి టైంలోనూ హీరోయిన్ అంజలి మీద ఆమె గాడ్ ఫాదర్ అనదగ్గ కోన వెంకట్ చూపించే అభిమానం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. కొన్నేళ్ల కిందట అంజలి తమిళంలో ఓ వివాదం కారణంగా సినిమాలు కోల్పోయిన సమయంలో తెలుగులో ‘బలుపు’ సినిమాలో కీలక పాత్ర దక్కింది. ఆ చిత్రానికి రచయిత కోన వెంకటే అన్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం మరిన్ని సినిమాల్లో కొనసాగింది. ఆమెను కథానాయికగా పెట్టి ‘గీతాంజలి’ సినిమా తీయించారు. ఆ చిత్రానికి రచయిత, నిర్మాతగానే కాక అన్నీ తానై వ్యవహరించాడు కోన. ఆ తర్వాత కోన దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన ‘శంకరాభరణం’లోనూ ఆమె కీలక పాత్ర చేసింది. ఇప్పుడు కోన వెంకట్ నిర్మాణంలో, రచనలో కీలకంగా వ్యవహరించిన ‘నిశ్శబ్దం’లోనూ అంజలిది ముఖ్య పాత్ర.

అందరూ ఇది అనుష్క సినిమా అనుకున్నారు కానీ.. ఆమెను మించి స్క్రీన్ టైం అంజలినే తీసుకోవడం విశేషం. ప్రథమార్ధంలో అయితే అంజలి తప్ప అనుష్క కనిపించదు. ఇది అనుష్క సినిమా అనే విషయాన్ని మరిచిపోయే స్థాయిలో ఆమె స్క్రీన్ టైం ఉంటుంది. ద్వితీయార్ధంలో అనుష్క ఫ్లాష్ బ్యాక్ రావడం అంజలి కనిపించదు కానీ.. మిగతా అంతటా ఆమెదే ఆధిపత్యం. కోనకు అంజలి మీద ఎంత ప్రత్యేక అభిమానం ఉన్నా సరే.. అనుష్కనే పక్కకు నెట్టేసి ఆమెకు అంత స్క్రీన్ టైం ఇప్పించడం ఆశ్చర్యం కలిగించే విషయం. అలాగని ఆమె పాత్ర అంత ప్రత్యేకంగా ఉందా అంటే అదీ లేదాయె.

This post was last modified on October 2, 2020 4:11 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago