ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన ప్రశాంత్ నీల్ ఇప్పటిదాకా చేసిన సినిమాలు నాలుగే. ఆ నాలుగు సినిమాల్లో కేజీఎఫ్‌ను ఒకే కథతో రెండు సినిమాలుగా తీశాడు. తొలి చిత్రం ఉగ్రం గురించి మన ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. దాన్ని పక్కన పెట్టి మూడు సినిమాలను చూస్తే అవన్నీ బ్లాక్ థీమ్‌తోనే సాగాయి. తన సినిమాల పోస్టర్లన్నీ బొగ్గు పులిమినట్లు ఉంటాయి. సినిమాలో విజువల్స్ కూడా అంతే.
కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ చూసినపుడు ఆ థీమ్ చాలా కొత్తగా అనిపించింది. కానీ సలార్ చూసే టైంకి జనాలకు కొంత మొనాటనస్ ఫీలింగ్ వచ్చింది. బ్లాక్ థీమ్ ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఇక ప్రశాంత్ సినిమాల్లో హీరోల ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు, ఎడిటింగ్ ప్యాటర్న్స్ కూడా ఒకే స్టయిల్లో సాగుతుంటాయి. దీని వల్ల ప్రశాంత్ సినిమాలన్నీ ఒకే రకంగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతోంది జనాలకు. దీంతో అతను తన తర్వాతి చిత్రానికి వైవిధ్యం చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్‌తో తీయబోయే తర్వాతి సినిమాకు కథా నేపథ్యాన్ని ప్రశాంత్ మారుస్తున్నాడట. అలాగే విజువల్‌గా కూడా ఈ సినిమా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం వరకు బ్లాక్ థీమ్‌ను పక్కన పెడుతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రశాంత్ ఈ సినిమాలో ప్రయత్నం చేయనున్నాడట. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించిన బ్లాక్ థీమ్.. సినిమాలో ఉండదని సమాచారం.
ఈ చిత్ర షూటింగ్ నవంబరు నెలాఖర్లో మొదలు కావచ్చని తెలుస్తోంది. కానీ తారక్ వెంటనే షూటింగ్‌కు హాజరు కాడట. ప్రస్తుతం తారక్ వార్-2 షూట్లో బిజీగా ఉన్నాడు. అతను జనవరి నుంచి ప్రశాంత్ సినిమాకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించనుంది. రిలీజ్ 2026 సంక్రాంతికి ఉండొచ్చు.
This post was last modified on %s = human-readable time difference 9:49 am
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మ్యాచ్‌లు జరుగుతుండగా, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన సలహా ఇచ్చారు. సీఎం సీటును లాక్కునేందుకు…
వినియోగదారులు ఎంతో ఇష్టంగా తినే 'మయోనైజ్' క్రీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. దీనిని వినియోగిస్తే.. రూ.5 నుంచి…
కెజిఎఫ్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా, సుదీర్ఘ విరామం గురించి అభిమానుల వైపు నెగటివ్ కామెంట్స్ వినిపించుకోకుండా యష్ ఎంపిక…
వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయన తనయ, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. జగన్ బెయిల్ రద్దు…
ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా భేటీ అయ్యారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల పైనే…