పెళ్ళిచూపులు చిత్రంతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్. అప్పటిదాకా ఒక మూసలో సాగిపోతున్న తెలుగు సినిమాలోకి అతను కొత్త నీరు తీసుకొచ్చాడు. అప్పటిదాకా అలాంటి కథ, పాత్రలు తెలుగు చిత్రాల్లో అరుదు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిందీ చిత్రం. దీంతో తరుణ్ భాస్కర్ మీద అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆపై తన నుంచి వచ్చిన సినిమాలు మెప్పించలేకపోయాయి.
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా కంటెంట్ ఉన్నదే కానీ.. బాక్సాఫీస్ దగ్గర సరైన విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘కీడా కోలా’ మూవీ చేశాడు తరుణ్. కానీ అది మరింత నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. తరుణ్ అభిమానులు తన నుంచి ఇంకేదో కోరుకుంటున్నారు కానీ.. అది అతనివ్వడం లేదు.
‘పెళ్ళిచూపులు’ తర్వాత తరుణ్ సరైన కాంబినేషన్లు సెట్ చేసుకోలేకపోయాడనే విమర్శా ఉంది. విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోతో సినిమా కోసం ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఐతే ఇప్పుడు తరుణ్ సరైన హీరోతోనే సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. తన తొలి చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండతో అతను జట్టు కట్టబోతున్నాడట.
విజయ్ ‘పెళ్ళిచూపులు’ తర్వాత పెద్ద రేంజికి వెళ్లాడు. ఐతే అతను కూడా ప్రస్తుతం డిజాస్టర్ స్ట్రీక్‌లో ఉన్నాడు. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు. దీంతో పాటు దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్న విజయ్.. కొత్త చిత్రాన్ని తాజాగా ఒప్పుకున్నట్లు సమాచారం. తరుణ్ భాస్కర్‌తో తన తర్వాతి సినిమా ఉంటుందట. ఈ కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉంటాయి. తరుణ్ మళ్ళీ సరైన సినిమా చేస్తుండడంతో తనకూ మంచి విజయం దక్కుతుందని ఆశిద్దాం.
This post was last modified on October 29, 2024 4:10 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…