Movie News

‘బాహుబలి-2’లో ‘ఆర్ఆర్ఆర్’ సగమేనట

‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాకు వచ్చిన హైప్, ఆ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, బాక్సాఫీస్ దగ్గర అది రేపిన సంచలనం ఒక చరిత్ర. ఇండియన్ సినిమా స్థాయికి వెయ్యి కోట్ల వసూళ్లు కూడా చాలా ఎక్కువ అనుకున్న సమయంలో ఆ చిత్రం ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.

‘దంగల్’ సినిమాను తర్వాత చైనాలో రిలీజ్ చేయడం, అక్కడ అది భారీ వసూళ్లు సాధించి ఓవరాల్‌గా రూ.2 వేల కోట్ల మార్కును టచ్ చేయడం వల్ల అది ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ అయింది కానీ.. లేదంటే ఇప్పటికీ ‘బాహుబలి-2’నే హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచేది. గతంతో పోలిస్తే టికెట్ల రేట్లు బాగా పెరిగినా, రిలీజ్ చేసే థియేటర్ల సంఖ్య పెరిగినా ఇతర చిత్రాలేవీ కూడా ఇప్పటిదాకా ‘బాహుబలి-2’ వసూళ్లను దాటలేకపోయాయి.

తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి-2’కు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. టికెట్ల అమ్మకాల్లో ‘బాహుబలి-2’ ఘనతను తర్వాత వచ్చిన చిత్రాలేవీ అందుకోలేదని.. అందులో సగానికి మించి టికెట్ల అమ్మకాలు చేయలేకపోయాయని ఆయన వెల్లడించాడు. ‘బాహుబలి-2’కు ఏకంగా 10 కోట్లకు పైగా టికెట్లు అమ్మినట్లు ఆయన వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌కు కూడా ఇందులో సగం టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు ఆయన తెలిపారు. ఇండియన్ సినిమాకు సంబంధించి అత్యధిక టికెట్ల అమ్మకాలు జరిగిన సినిమాగా ‘షోలే’ పేరిట రికార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ చిత్రానికి 13 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని.. కానీ ఆ చిత్రం సంవత్సరాల తరబడి ఆడిందని కాబట్టే ఆ ఘనత సాధించిందని.. కానీ ‘బాహుబలి’ తక్కువ థియేట్రికల్ రన్‌తోనే 10 కోట్ల మార్కును అందుకుందని.. మోడర్న్ సినిమాలో దీన్ని టచ్ చేసే చిత్రమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

This post was last modified on October 29, 2024 5:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

3 hours ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

5 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

6 hours ago

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…

6 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

7 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

8 hours ago