లారెన్స్ రాఘవేంద్ర హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో కొన్ని నెలల క్రితమే ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కిల్ రీమేకనే ప్రచారం చాలా గట్టిగా తిరిగింది. నిర్మాణ సంస్థ కోనేరు దగ్గరే హక్కులు ఉండటం దీనికి కారణం. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ ఇవాళ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ కిల్ రీమేక్ కాదు. పూర్తిగా వేరే ఫాంటసీ సబ్జెక్టుతో కాల భైరవగా అనౌన్స్ చేశారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో విజువల్స్, ట్యాగ్ చూస్తుంటే ఏదో సూపర్ హీరో కథకి జానపదం మిక్స్ చేసి డిఫరెంట్ గా చెప్పబోతున్నట్టు అర్థమయ్యింది. విఎఫెక్స్ పెద్ద ఎత్తున ఉండబోతోంది.
ఇందులో త్రిషని హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఒప్పుకోలేదు కానీ కథ విని సానుకూలంగా స్పందించిందని చెన్నై టాక్. చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, మోహన్ లాల్ లాంటి అగ్ర సీనియర్ హీరోలతో నటిస్తున్న టైంలో ఇది ఒప్పుకోవడం పట్ల ఫ్యాన్స్ లో అనుమానాలున్నాయి కానీ ఇప్పుడవన్నీ లెక్కలేసుకునే స్టేజిలో త్రిష లేదు. క్రేజీ ప్రాజెక్టు అనిపిస్తే ఒప్పేసుకుంటోంది. విజయ్ లియోలో టీనేజ్ కుర్రాడి తల్లిగా నటించడానికి అందుకే వెనుకాడలేదు. సో కాల భైరవలో ఎంపికైనా ఆశ్చర్యం లేదు. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేం.
ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న కాల భైరవకు మిగిలిన క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా ఫైనల్ చేయలేదు. చంద్రముఖి 2 దారుణంగా పోయాక లారెన్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో తుస్సుమంది. ఇటీవలే కాంచన 4 లాక్ చేసుకున్నాడు. దుర్గ టైటిల్ పరిశీలనలో ఉంది. మరి కాల భైరవతో పాటు కిల్ రీమేక్ చేస్తాడా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్స్. రాక్షసుడు రీమేక్ తో హిట్ కొట్టి రవితేజ ఖిలాడీతో డిజాస్టర్ అందుకున్న రమేష్ వర్మకు ఇప్పుడీ కాల భైరవ సక్సెస్ చాలా కీలకం.
This post was last modified on October 29, 2024 3:17 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…