‘పుష్ప: ది రూల్’ విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సీక్వెల్ కావడం వల్ల దీని గురించి ఏ అప్‌డేట్ బయటికి వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. యూనిట్లో ఒక్కొక్కరుగా సినిమా గురించి ఒక రేంజ్‌లో ఎలివేషన్లు ఇస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ మధ్య ‘పుష్ప-2’ ఫస్టాఫ్ లాక్ చేసిన సందర్భంగా దాని గురించి మేకర్స్ ఒక రేంజిలో చెప్పారు. తాజాగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాతలు సినిమా మామూలుగా ఉండదని చెప్పుకొచ్చారు. సినిమాలో చాలా హైలైట్లు ఉన్నాయని.. మూడో పార్ట్‌కు అదిరిపోయే లీడ్ ఉందని వెల్లడించారు. మరోవైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫస్టాఫ్‌లో కొన్ని ఎపిసోడ్లు మామూలుగా పేలవని.. ప్రతిదీ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అనిపిస్తుందని ఎలివేషన్ ఇచ్చాడు.
తాజాగా ‘పుష్ప-2’లో కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడింది. ‘బిగ్ బాస్’ షోకు అతిథిగా వచ్చిన ఆమెను పుష్ప-2 గురించి చెప్పమని హోస్ట్ అక్కినేని నాగార్జున అడగ్గా.. మీరు నా వెనుక ఉంటారా మాట్లాడతా అని అనసూయ అంది. సరే అని నాగ్ చెప్పడంతో ‘పుష్ప-2’ గురించి ఆమె మాట్లాడింది. ‘పుష్ప’లో ఇదే క్లైమాక్స్ అనిపించే ఎపిసోడ్ ప్రతి పది నిమిషాలకూ ఒకటి వస్తుందని ఆమె చెప్పింది. ‘పుష్ప-1’ కేవలం ఇంట్రో మాత్రమే అని.. ‘పుష్ప-2’నే అసలు సినిమా అని.. ఇందులోనే చాలా కథ, ఎన్నో ట్విస్టులు ఉంటాయని అనసూయ చెప్పింది.
సినిమా మామూలుగా ఉండదని.. బన్నీ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని ఆమె చెప్పింది. ఇప్పటికే ‘పుష్ప-2’ మీద పెరిగిన అంచనాలు అనసూయ వ్యాఖ్యలతో ఇంకా పీక్స్‌కు చేరుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 28, 2024 7:41 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…