Movie News

దేవిశ్రీప్రసాద్ పాటకు అనిరుధ్ డాన్స్

సినిమాలకు సంబంధించి కొన్ని కలయికలు క్రేజీగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది. నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ అంతే గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి రెండు వేల కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పడం అభిమానుల ఎగ్జైట్ మెంట్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. రెండున్నర గంటల పాటు ఇండియన్ స్క్రీన్ మీద చూడని ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తామనే హామీ ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దామా అనిపించేలా ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే కంగువలో అనిరుధ్ రవిచందర్ ఒక స్పెషల్ క్యామియో చేశాడట. సాధారణంగా తను సంగీత దర్శకత్వం వహించే పాటల్లో కనిపించడం ఈ కుర్రాడికి అలవాటే. అజ్ఞాతవాసి నుంచి వేట్టయన్ దాకా చాలాసార్లు చేశాడు. కానీ కంగువకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అయినా ఒప్పుకున్నాడంటే దర్శకుడు సిరుతై శివ, హీరో సూర్యల వ్యక్తిగత రిక్వెస్ట్ కావొచ్చు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం యోలో సాంగ్ లో ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ ఇది కాకపోతే ఏదైనా సర్ప్రైజ్ ఎపిసోడ్లో తన ఎంట్రీ కావొచ్చట. విశ్వసనీయ సమాచారం మేరకు దేవి పాటకే అనిరుధ్ డాన్స్ చేశాడని అంటున్నారు.

గోవాకు సంబంధించిన షెడ్యూల్ లోనే అనిరుధ్ పాల్గొన్నాడట. గత కొంత కాలంగా కోలీవుడ్ ని పూర్తిగా డామినేట్ చేస్తున్న అనిరుధ్ కి సారైనా పోటీ అనిపించేలా దేవిశ్రీ ప్రసాద్ ఈ కంగువలో ఏదైనా మేజిక్ చేసి ఉంటాడనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. పీరియాడిక్ ఫాంటసీ డ్రామా కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం కానుంది. పూర్తి స్థాయి ట్రైలర్ ఇంకా రాలేదు కనక అంచనాలు ఎంత పెట్టుకోవాలనేది ఇంకా తేలలేదు కానీ డిఎస్పి కెరీర్ బెస్ట్ అవుతుందనే టాక్ మాత్రం అంతర్గతంగా ఉంది. దిశా పటాని హీరోయిన్ గా నటించిన కంగువలో బాబీ డియోల్ విలనిజం కొత్తగా ఉంటుందని వినికిడి.

This post was last modified on October 27, 2024 4:26 pm

Share

Recent Posts

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

24 minutes ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

3 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

4 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

12 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

12 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

13 hours ago