ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. ‘కంగువ’నే. సూర్య హీరోగా ‘శౌర్యం’ ఫేమ్ శివ రూపొందించిన ఈ చిత్రం నవంబరు 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇది బేసిగ్గా తమిళ మూవీ అయినా.. తెలుగు, హిందీలో సైతం ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కొంచెం ముందుగానే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి పూర్తిగా ప్రమోషన్ల మీద దృష్టిపెట్టింది టీం.
ఆల్రెడీ హైదరాబాద్‌లో ఈవెంట్ చేశారు. తాజాగా చెన్నైలో తమిళ వెర్షన్ ఆడియో వేడుక జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయన ‘కూలీ’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో రాలేకపోయారు. కానీ టీం కోసం ఒక వీడియో సందేశాన్ని పంపించారు. అందులో రజినీ సరదాాగా మాట్లాడారు.
శివతో రజినీకాంత్ ‘అన్నాత్తె’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ శివతో రజినీకి మంచి అనుబంధమే ఉంది. ‘అన్నాత్తె’ చేసేటపుడు మనిద్దరం కలిసి ఒక పీరియడ్ మూవీ చేస్తే బాగుంటుందని చెప్పేవాడినని.. బహుశా తన కోసమే అతను ‘కంగువ’ కథ రాసి ఉంటాడని.. చివరికి అది సూర్య, జ్ఞానవేల్ రాజాల దగ్గరికి చేరిందని ఆయన నవ్వుతూ అన్నారు.
‘కంగువ’ ట్రైలర్ అద్భుతంగా ఉందని.. సూర్య గొప్ప నటుడని, అతడికి మంచి విజయం చేకూరాలని రజినీ ఆకాంక్షించారు. నిజానికి ‘కంగువ’ దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కాావాల్సింది. కానీ రజినీ సినిమా ‘వేట్టయన్’ను దసరాకే రిలీజ్ చేయాలని భావించడంతో రజినీ మీద గౌరవంతో తమ చిత్రాన్ని సూర్య అండ్ కో వాయిదా వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ‘కంగువ’ ఆడియో వేడుకకు రజినీ ముఖ్య అతిథిగా రావాలనుకున్నారు. కానీ ఇటీవలే అనారోగ్యం కారణంగా కొన్ని వారాల పాటు ఇంటికే పరిమితమైన సూపర్ స్టార్.. కొన్ని రోజుల నుంచి ‘కూలీ’ చిత్రీకరణకు హాజరవుతున్నారు. అందులో బిజీగా ఉండడంతో ‘కంగువ’ టీంను విష్ చేస్తూ రజినీ వీడియో పంపించారు. ఆయన ఇలా చేయడం అరుదు.
This post was last modified on October 27, 2024 4:00 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…