Movie News

కల్కి-2 = రెండు మూడు సినిమాలు

బాహుబలి తర్వాత ఒక కథను రెండు భాగాలుగా చెప్పే ఒరవడి పెరిగింది. కొందరు కథను రెండు భాగాలుగా తీస్తే ఇంకొందరు ఒక కథను ముగించి దానికి సీక్వెల్ చేస్తున్నారు. గ ఏడాది కాలంలో వచ్చిన భారీ చిత్రాలు సలార్, కల్కి, దేవర.. అన్నీ కూడా సెకండ్ పార్ట్‌తో రాబోయేవే. వీటిలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే.. కల్కి-2నే.

జులై నెలాఖర్లో విడుదలైన ‘కల్కి’ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో రెండో భాగం మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి.

ఫస్ట్ పార్ట్ విషయంలో ఉన్న అసంతృప్తి రెండో భాగంలో ఉండదని.. ఇంకా భారీ స్థాయిలో సినిమా ఉంటుందని.. ప్రభాస్ పాత్ర ఇంకా బలంగా ఉండి తన చుట్టూనే కథ తిరుగుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి-2’ గురించి మాట్లాడాడు.

తమిళ అనువాద చిత్రం ‘అమరన్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగికి యాంకర్ సుమ నుంచి ‘కల్కి-2’కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

ఆ సినిమా అప్‌డేట్ ఇవ్వమని అడిగితే.. కల్కి-2కు పార్ట్-1తో పోలిస్తే ఇంకా భారీగా ఉంటుందని అతను చెప్పాడు. కల్కి-2 ఒక్క సినిమా.. రెండు మూడు చిత్రాలకు సమానమని అంత భారీగా ఉంటుందని నాగి తెలిపాడు. ఐతే కల్కి-2 రావడానికి చాలా టైం మాత్రం పడుతుందని.. ఇప్పట్లో ఆ సినిమా ఉండదని నాగి చెప్పాడు.

ప్రస్తుతం స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు నడుస్తున్నట్లు నాగి చెప్పాడు. తన వరకు అయితే తర్వాతి చిత్రం ‘కల్కి-2’నే అని.. వేరే సినిమాలేవీ పెట్టుకోలేదని నాగి చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ‘కల్కి-2’ను మొదలుపెట్టాలంట ఇంకో ఏడాదికి పైగానే సమయం పట్టొచ్చని భావిస్తున్నారు.

This post was last modified on %s = human-readable time difference 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాడీ గార్డే లైంగికంగా వేధిస్తే..

‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, చేదు అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు.…

15 mins ago

ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో వైసీపీ.. ష‌ర్మిల‌ పై మూక దాడి!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై వైసీపీ నాయ‌కులు ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు అన్న‌ట్టుగా…

56 mins ago

డౌట్ లేదు.. సంక్రాంతికే కలుస్తున్నారు

టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయనే విషయంలో ప్రతిసారీ ఉత్కంఠ నెలకొంటుంది. ఈసారి కూడా అందుకు…

2 hours ago

కిరణ్ అబ్బవరం ఘటికుడే

సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్.. వీటిలో ఏది అతి పెద్ద డిజాస్టర్, కంటెంట్…

3 hours ago

ఏపీ ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్లు.. కూట‌మికి ప‌దిలంగా.. !

రాష్ట్రంలో ప‌ట్ట‌భ‌ద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెలలో ఈ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌త్య‌క్షంగా…

4 hours ago

‘కంగువ’ కథ నాకోసమే రాశారేమో-రజినీ

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. ‘కంగువ’నే. సూర్య హీరోగా ‘శౌర్యం’ ఫేమ్ శివ రూపొందించిన…

4 hours ago