నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ తండేల్ మీద క్రమంగా ఒత్తిడి పెరిగిపోతోంది. విడుదల తేదీని ప్రకటించడంలో నిర్మాతలు బన్నీ వాస్, అల్లు అరవింద్ చేస్తున్న జాప్యం అభిమానులను అసహనానికి గురి చేస్తోంది.
డిసెంబర్ వద్దనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి దింపమని, ఎలాగూ నాగార్జున సినిమా పండక్కు లేదు కాబట్టి ఆయన కొడుకుని చూసుకుని మురిసిపోతామని డిమాండ్ చేస్తున్నారు. కానీ రకరకాల కారణాలు తండేల్ ని ఎటు తేల్చుకోనివ్వడం లేదు. దీంతో అన్నివైపులా మద్దెలదరువు అన్నట్టు దర్శకుడితో పాటు టీమ్ నలిగిపోతోంది.
రిస్క్ తీసుకుని సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నా గేమ్ చేంజర్, బాలయ్య 109, వెంకటేష్ 76లను తట్టుకోవడం అంత సులభం కాదు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు థియేటర్ల విషయంలో రాజీ పడి ఎందుకు రీచ్ తగ్గించుకోవాలనేది గీతా ఆర్ట్స్ ఆలోచన.
దాని బదులు జనవరి చివరి వారం రిపబ్లిక్ డేని టార్గెట్ చేసుకుంటే సోలోగా వచ్చే అడ్వాంటేజ్ తో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని భావిస్తోంది. కానీ ఇది ఫ్యాన్స్ కు ఇష్టం లేదు. ఒకవేళ అలా చేస్తే మా మద్దతు ఉండదంటూ ఎక్స్ ప్లాట్ ఫామ్ లో మెసేజులు పెడుతున్నారు. ఇంతకీ పూర్తి షూటింగ్ అయిపోయిందో లేదో కూడా సరైన స్పష్టత లేదు.
పోనీ చొరవ తీసుకుని ఏమైనా చెబుదామంటే నాగచైతన్య సైతం అయోమయంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ దశ నుంచి ఇప్పటిదాకా తండేల్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. కెరీర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో దేహాన్ని నల్లగా చేసుకుని, హెయిర్ స్టైల్ మార్చుకుని దర్శకుడు చందూ మొండేటి అడిగినదంతా ఇచ్చాడు.
తీరా విపరీతమైన కాంపిటీషన్ లో దిగాల్సి వస్తే అదెంత రిస్కో తనకు తెలియంది కాదు. పైగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సాయిపల్లవి పెర్ఫార్మన్స్ లాంటి ఎన్నో అంశాలు బజ్ పెంచుతున్నాయి. ఫైనల్ గా తండేల్ త్రాసు ఎటువైపు ఎప్పుడు తిరుగుతుందో తేలాలంటే వేచి చూడాలి.
This post was last modified on October 26, 2024 8:37 pm
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…