మాములుగా పెద్ద ప్యాన్ ఇండియా మూవీ వస్తుందంటే దానికి ముందు వెనుకా పోటీ వచ్చేందుకే నిర్మాతలు రిస్క్ తీసుకోరు. అలాంటిది నేరుగా క్లాష్ కి సిద్ధపడటం ఊహించలేం. ఉదాహరణకు దేవర, కల్కి 2898 ఏడి టైంలో ఎవరూ పోటీకి ఇష్టపడలేదు.
దీంతో భారీ ఓపెనింగ్స్ తో పాటు పాజిటివ్ టాక్ రూపంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫలితం వందల కోట్ల వసూళ్లు కురిపించింది. కంగువకి సైతం అలాంటి వాతావరణం ఆశిస్తున్నారు అభిమానులు. దీని ప్రమోషన్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ దాకా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్న సూర్యని ముగ్గురు హీరోలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కవ్వించేందుకు రెడీ అవుతున్నారు.
కంగువ వస్తున్న నవంబర్ 14న వరుణ్ తేజ్ ‘మట్కా’ దిగుతోంది. హీరో వరస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ టీజర్ తీసుకొచ్చిన హైప్ వల్ల బిజినెస్ ఎంక్వయిరీలు పెరిగాయని సమాచారం. దర్శకుడు కరుణ కుమార్ మంచి ఇంటెన్స్ మాఫియా డ్రామాని తీశాడనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది.
మరొకటి అశోక్ గల్లా హీరోగా రూపొందిన అతని రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథ కావడంతో మార్కెటింగ్ లో ఈ అంశాన్ని బాగా వాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరంగా కంగువకి ఇవి కొంచెం స్పీడ్ బ్రేకర్స్ మారడం ఖాయం. ఇంకా పూర్తి పబ్లిసిటీ మొదలుపెట్టలేదు.
ఇక్కడితో కథ అయిపోలేదు. శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్ ‘భైరతి రణగల్’గా వస్తున్నాడు. జైలర్ తెచ్చిన ఇమేజ్ పుణ్యమాని ప్రధాన భాషలు అన్నిటిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఒక రోజు ఆలస్యంగా నవంబర్ 15 రావడం కర్ణాటకలో కంగువకు కొంచెం రిలీఫ్.
ఈ ముగ్గురిని తట్టుకోవడమే కాక కంగువని టీజ్ చేస్తున్న హాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఓవర్సీస్ లో ‘గ్లాడియేటర్ 2’ నుంచి ముప్పు పొంచి ఉంది. బాలీవుడ్ లో వివాదాస్పద చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ని తక్కువంచనా వేయడానికి లేదు. చూస్తుంటే రెండు వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్న కంగువకి ఇవన్నీ పెను సవాళ్లుగా మారబోతున్నాయి.
This post was last modified on October 26, 2024 5:18 am
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…