Mrunal Thakur
తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా విజయం సాధించడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇంకేం టాప్ లీగ్ లోకి వెళ్లిపోతుందనుకున్న టైంలో ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ మాములుగా కొట్టలేదు. దాని వల్లే కెరీర్ డౌన్ కాకపోయినా అవకాశాలు, మార్కెట్ మీద విజయ్ దేవరకొండ మూవీ ప్రభావం చూపించింది. నిజానికి కంగువలో సూర్య సరసన ముందు మృణాల్ నే అనుకున్నారట. అయితే డేట్ల విషయంలో వచ్చిన ఇబ్బంది వల్ల వదులుకోవాల్సి వస్తే ఆ ఛాన్స్ కాస్తా దిశా పటానిని వరించింది.
తీరా చూస్తే కంగువలో తనుండేది చివరి ఇరవై నిముషాలు మాత్రమే అని తేలడంలో ఒకరకంగా మృణాల్ ఠాకూర్ నష్టపోయింది పెద్దగా లేదనే చెప్పాలి. అలాని సూర్యకు జోడి అయ్యే అవకాశం మిస్ కాలేదు. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోయే ఫాంటసీ థ్రిల్లర్ లో మృణాల్ నే ఎంపిక చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు. ప్రస్తుతం కంగువ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సూర్య దీని థియేటర్ రన్ అయ్యాక కొత్త సినిమాల అప్డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో అభిమానులు ఇంకో నెల రోజులు ఆగాల్సి ఉంటుంది.
ఇక తెలుగులో చూస్తే మృణాల్ కొత్తగా సైన్ చేసిన ప్రాజెక్టులు లేవు. హిందీలో మాత్రం చెప్పుకోదగ్గ బిజీగానే ఉంది. పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ అఫ్ సర్దార్ 2, తుమ్ ఓ హో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సౌత్ కంటే ఎక్కువ బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తున్న మృణాల్ ఠాకూర్ ఆ మధ్య కల్కి 2898 ఏడిలో చిన్న పాత్ర చేసింది. తమిళ డెబ్యూ ఏకంగా సూర్యతోనే అంటే ఒకరకంగా జాక్ పాటు కొట్టినట్టే. ఇది కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందుతోంది. ఇంకో హీరోయిన్ ఉంటుందనే ప్రచారంలో రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉందని సమాచారం.
This post was last modified on October 25, 2024 5:31 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…