బాలీవుడ్ హీరోయిన్ల పీఆర్ గిమ్మిక్స్ గురించి అప్పుడప్పుడూ వార్తలు బయటికి వస్తుంటాయి. వాళ్లు ఎయిర్ పోర్ట్‌లో అడుగు పెడితే చాలు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోతుంటాయి. తమకు తెలియకుండా ఇవి జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. కానీ ఇదంతా పీఆర్ టీమ్స్ మహిమ అని సౌత్ హీరోయిన్ ప్రియమణి గతంలో వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్లను నియమించుకుని సదరు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేలా చూసుకుంటారని.. తనకు కూడా ఇలాంటి ఆఫర్లు ఇచ్చారని, కానీ అంగీకరించలేదని ప్రియమణి వెల్లడించింది.
ఇప్పుడు సాయిపల్లవి కూడా ఇలాంటి కామెంట్సే చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ హీరోయిన్లు నిత్యం వార్తల్లో ఉండేందుకు పీఆర్ టీమ్స్ ద్వారా ఎలా ప్రయత్నిస్తారో ఆమె వెల్లడించింది.
తన కొత్త చిత్రం ‘అమరన్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. “బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల నాకు ఫోన్ చేశారు. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి, వార్తల్లో నిలవడానికి పీఆర్ టీంను నియమించుకుంటారా అని అడిగాడు. అలా చేస్తే నేను లైమ్ లైట్లో ఉండగలను. ప్రేక్షకులు తరచూ నా గురించి మాట్లాడుకుంటారు. కానీ దాని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అనిపించింది. ఎందుకంటే తరచూ నా గురించి మాట్లాడాలన్నా ప్రేక్షకుల విసుగు వస్తుంది. అందుకే నాకు అలాంటిదేమీ అవసరం లేదని చెప్పేశా” అని చెప్పింది.
సాయిపల్లవి ఎవరి పేర్లూ ప్రస్తావించకపోయినా, ఎవరి మీదా విమర్శలు చేయకపోయినా.. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా పీఆర్ టీంలను మెయింటైన్ చేయడం ద్వారా నిత్యం తాము వార్తల్లో ఉండేలా, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చూసుకుంటారని చెప్పకనే చెప్పినట్లు అయింది. దీంతో సాయిపల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.
This post was last modified on October 25, 2024 7:08 pm
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…