Movie News

ప్రశాంత్ నీల్ మీద ఒత్తిడి ఉందా

కెజిఎఫ్, సలార్ తో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాలను పరిచయం చేసి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది కానీ తమిళంలో ఇప్పటికే అది ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందుతున్న సినిమాకు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా మొన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 మొదలవబోతోందని కొన్ని పేరున్న ట్విట్టర్ హ్యాండిల్స్ లో రావడం అభిమానుల్లో అయోమయానికి దారి తీసింది.

హోంబాలే ఫిలింస్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా ఇతరులు చెప్పడం గురించి రకరకాల ప్రచారం జరిగిపోయింది. బెంగళూరు టాక్ చూస్తూనేమో ప్రశాంత్ నీల్ మీద సలార్ 2 శౌర్యంగపర్వం త్వరగా పూర్తి చేసే తారక్ ప్రాజెక్టుకు వెళ్లిపొమ్మని నిర్మాణ సంస్థ అడిగిందట. కానీ అందులో నిజం లేదని ప్రభాస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. నిజంగా నీల్ ఇప్పటికిప్పుడు సలార్ 2 తీయాలంటే డార్లింగ్ నుంచి ఎలాంటి అభ్యంతరం రాదని, కానీ ప్రస్తుతమున్న కమిటీ మెంట్ల దృష్ట్యా ఇంకో సంవత్సరం తర్వాత కానీ సాధ్యపడదని గుర్తించి ఆ మేరకు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారని వినికిడి.

జూనియర్ ఎన్టీఆర్ జనవరి లేదా ఫిబ్రవరి లోగా వార్ 2కి సంబంధించిన మొత్తం షూటింగ్ ని పూర్తి చేసుకోబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కోసం ఫ్రీ అవుతాడు. దేవర 2 ఇప్పుడప్పుడే అర్జెంట్ గా మొదలుపెట్టే ప్లాన్ ఏదీ లేదు. ఎలాగూ 2026 సంక్రాంతి రిలీజని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు కానీ ఎన్టీఆర్, నీల్ ఇద్దరూ పూర్తిగా ఒకే ప్రాజెక్ట్ మీదే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు సలార్ 2 సాధ్యం కాదు. కెజిఎఫ్ 3 ఉండొచ్చని యష్ చెప్పాడు కానీ టాక్సిక్, రామాయణం అయ్యేలోపు 2027 వచ్చేస్తుంది. ఆలోగా ప్రశాంత్ నీల్ పైన రెండు సినిమాలు గుమ్మడికాయ కొట్టేసి వచ్చేస్తాడు. సో దేని గురించి ఒత్తిడి లేదన్నమాట.

This post was last modified on October 25, 2024 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

5 hours ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

5 hours ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

6 hours ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

8 hours ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

9 hours ago