Movie News

కుర్ర హీరోకి ట్రెండ్ బోధపడింది

డెబ్యూ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులు ఎక్కువ చూసిన కిరణ్ అబ్బవరం కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా క. ఒకే అక్షరంని టైటిల్ గా పెట్టుకున్న చిత్రాలు గత కొన్నేళ్లలో ఏవీ రాలేదు. ఆ రకంగా చూసినా ఇది వెరైటీ ప్రయోగమే. స్వంతంగా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు కథ మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా ఖర్చు పెట్టిన ‘క’ వచ్చే వారం అక్టోబర్ 31 దీపావళి పండగ సందర్భంగా రిలీజవుతోంది. పోటీ ఎక్కువగా ఉన్నా సరే చాలా ధీమాగా కాంపిటీషన్ ఎదురుకోబోతున్నాడు.

అందుకే అంచనాల పరంగా అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. వాస్తవానికి నిన్న సాయంత్రమే రావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం చేశారు. విజయవాడలో లాంచ్ ఈవెంట్ చేసి ఇవాళ ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది. కొన్ని పదుల సంవత్సరాల క్రితం కొండల మధ్య ఉండే ఒక మారుమూల గ్రామంలో పని చేసే ఒక పోస్ట్ మ్యాన్ (కిరణ్ అబ్బవరం) అనుకోకుండా వేరే వ్యక్తి రాసిన ఉత్తరం చదవడం వల్ల ప్రమాదంలో పడతాడు. ఊరిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రాణాలకు తెగించి అతనేం చేశాడనేదే స్టోరీ.

దర్శకుడు సుజిత్ అండ్ సందీప్ చెప్పిన కథని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఉందని గుర్తించిన కిరణ్ ఇప్పటికైతే సరైన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అవసరం లేని మూస, మాస్ జోలికి పోకుండా విరూపాక్ష, మంగళవారం తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘క’ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పోటీలో మనుగడ సాధించాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పనిసరి. సామ్ సిఎస్ నేపధ్య సంగీతంతో పాటు ఆర్ట్ వర్క్, సాంకేతిక వర్గం పనితనం అన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఆడియన్స్ తత్వాన్ని అర్థం చేసుకున్న కిరణ్ కి ఇది సక్సెస్ కావడం చాలా కీలకం.

This post was last modified on October 25, 2024 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago