ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా కూడా దెయ్యాలు ఆత్మలు అనగానే మన అగ్ర హీరోలు కాస్త దూరంగానే ఉంటారు. ఇక అగ్ర దర్శకులు సైతం ఆ రూట్లో రిస్క్ ఎక్కువ అని కనీసం ఆలోచన కూడా చేయరు. హారర్ + అగ్ర హీరో అనే కాంబినేషన్ ఇటీవల కాలంలో ఎవరు ఊహించనిది. ఇక మారుతి, ప్రభాస్ తో ఆ రిస్క్ తీసుకుంటున్నాడు.
హారర్ సినిమాలు క్లిక్కయితే ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ దెయ్యాలని హీరో స్టార్ ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయడం దగ్గరే అసలు సమస్య వస్తుంది. ఇక రాజా సాబ్ లో దర్శకుడు సేఫ్ జోన్ లో హీరోనే ఆత్మ రూపంలో చూపించనున్నాడు. ఆ విషయం ప్రభాస్ పుట్టినరోజు విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా అర్థమైపోయింది.
ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని మరో క్లారిటీ వచ్చేసింది. రాజు గారి క్యారెక్టర్ అలాగే ప్రస్తుతం లవర్ బాయ్ తరహాలో మరో ప్రభాస్ కనిపించనున్నాడు. అయితే పాత్రలు రెండే అయినా గెటప్స్ మాత్రం మూడని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో దెయ్యంగా మారకముందు ఉండే గెటప్ మరింత ఎట్రాక్టివ్ గా ఉంటుందని తెలుస్తోంది. అది సినిమాలో అసలైన సర్ ప్రైజ్ గా డిజైన్ చేశారట.
కాస్త రొమాంటిక్ టచ్ ఇస్తూనే భయపెట్టే రాజా సాబ్ మరోవైపు నవ్విస్తారట. ఏదేమైనా ప్రభాస్ స్టార్ ఇమేజ్ తో ఇలాంటి కథలను హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పని. కానీ ప్రభాస్ ను పూర్తి స్థాయిలో అల్లరిగా చూసి చాలా కాలమైంది. అలాంటిది దెయ్యంతో చూపిస్తే కొత్తగా ఉంటుంది. ఏమాత్రం క్లిక్కయినా మారుతి సీక్వెల్ కూడా ప్లాన్ చేయవచ్చు.
This post was last modified on October 24, 2024 9:41 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…