సలార్ 2 సౌండ్ లేదు ఎందుకు

ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినిమాలు తీస్తున్న, తీయబోతున్న నిర్మాణ సంస్థల నుంచి మంచి అప్డేట్స్ ఆశించారు అభిమానులు. దానికి తగ్గట్టే ది రాజా సాబ్ షాకింగ్ లుక్ తో దర్శనమిచ్చాడు. ఫౌజి అప్డేట్ ని మైత్రి వాళ్ళు అందించారు. అయితే సలార్ 2 శౌర్యంగపర్వం నుంచి కూడా ఏదైనా కంటెంట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఇప్పటికైతే జరగలేదు. కానీ కొందరు మీడియా ఇన్ఫ్లు యెన్సర్లకు సలార్ 2 ఆల్రెడీ మొదలైపోయిందని సమాచారం పంపడంతో కన్ఫ్యూజన్ నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేయడంతో అందరూ నిజమే అనుకున్నారు.

కానీ అసలైన హోంబాలే ఫిలిమ్స్ నుంచి ఏ న్యూస్ లేకపోవడం అసలు ట్విస్ట్. బఘీరా తాలూకు ప్రమోషన్ తో పాటు ది రాజా సాబ్ పోస్టర్ ని షేర్ చేయడం, సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ తన హీరోకు శుభాకాంక్షలు చెప్పడం తప్ప ఏమి లేదు. ఎక్కడా సలార్ 2 ప్రస్తావన కానీ దానికి ముడిపడిన ట్యాగ్స్ కానీ ఏమి లేవు. ఒకవేళ రాత్రి లోపు ఏదైనా అప్డేట్ ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఇప్పట్లో లేనట్టే. దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో ప్రారంభించబోతున్న జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండగా సలార్ 2 ఎలా సాధ్యమనేది సగటు ప్రేక్షకుల్లోని అనుమానం.

పైగా ప్రభాస్ చాలా బిజీ ఉన్నాడు. ది రాజా సాబ్ ఇంకొంచెం మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఫౌజీని ఆల్రెడీ మొదలుపెట్టేశారు. ఈ వారంలోనే డార్లింగ్ సెట్స్ లో అడుగు పెడతాడు. ఆపై స్పిరిట్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సలార్ 2 ఎప్పుడు ఉంటుందనే సందేహం రావడం సహజం. లేదని ఎవరూ చెప్పరు కానీ బాగా టైం పట్టబోతున్న మాట వాస్తవం. ఎలా చూసుకున్నా 2026లో తప్ప అంతకన్నా ముందే సలార్ 2 రావడం కష్టమే అనిపిస్తుంది. కల్కి 2 నుంచి ఏదైనా సాలిడ్ అప్డేట్ ఉందనుకుంటే అదీ జరగలేదు. ఉన్నవాటితో పాటు రీ రిలీజులతో సర్దుకోవడం తప్ప ఫ్యాన్స్ చేయగలిగింది ఏముంది.