2016లో విడుదలైన దంగల్ హీరో అమీర్ ఖాన్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా చెప్పొచ్చు. కమర్షియల్ మూసలకు దూరంగా ఒక రియల్ లైఫ్ బయోపిక్ తెరకెక్కించిన తీరు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చి పెట్టింది. జపాన్, చైనా లాంటి దేశాల్లోని ప్రేక్షకులను సైతం ఎమోషన్ కు గురి చేసిందంటే ఇందులో భావోద్వేగాలు ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అయితే తొమ్మిదేళ్ల తర్వాత దంగల్ మీద పలు ఆరోపణలు రావడం విచిత్రం. ఈ సినిమా పేరొందిన కుస్తీ పహిల్వాన్ మహావీర్ ఫోగట్ తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్ళ విజయాల ఆధారంగా తీసిన విషయం తెలిసిందే.
తాజాగా మహవీర్ తనయలో ఒకరైన బబిత ఫోగాట్ కొన్ని సంచలనాత్మక విషయాలు పంచుకున్నారు. 2010లో ఒక జర్నలిస్టు వీళ్ళ కుటుంబాన్ని సంప్రదించి ఈ ఫ్యామిలీ విజయ గాధని పేపర్లో ప్రచురించాడు. దీన్ని చదివిన దర్శకుడు నితేశ్ తివారి ఒక డాక్యుమెంటరీ తీస్తానని చెప్పి మహావీర్, బబిత, కవితలను కలిశాడు. స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని వచ్చి మొత్తం చదివి వినిపిస్తే అందరూ కదిలిపోయారు. పేర్లు మారుస్తానంటే మహావీర్ ఒప్పుకోకపోవడంతో అలాగే ఉంచేశారు. కట్ చేస్తే వరల్డ్ లెవెల్ లో దంగల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రాయల్టి రూపంలో మహావీర్ ఫ్యామిలీకి ఇచ్చిన మొత్తం కేవలం కోటి రూపాయలేనట.
స్వంత గ్రామంలో అకాడెమి ఏర్పాటు కోసం మహావీర్ అమీర్ ఖాన్ ను కలిశాడు. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ప్రొడక్షన్ హౌస్ ని సంప్రదించాడు. మొత్తం అయిదు కోట్ల దాకా అవుతుందని విన్నవించాడు. కానీ దానికి దంగల్ బృందం రియాక్ట్ అవ్వలేదు. పలుమార్లు తిరిగి ఇక పనవ్వదని గుర్తించి అక్కడితో వదిలేశారు. రెండు వేల కోట్లు వసూలు చేస్తే కేవలం కోటి ఇవ్వడం ఏమిటన్న బబిత కామెంట్స్ వైరలవుతున్నాయి. రన్బీర్ కపూర్ తో వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు నితేశ్ తివారి సినిమా తీస్తున్న టైంలో ఇలాంటి కాంట్రావర్సి రావడం గమనార్హం. ఏదైనా మతలబు ఉందేమో.
This post was last modified on October 23, 2024 5:46 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…