ఊరించి ఊరించి కొంచెం ఆలస్యం చేసినా ది రాజా సాబ్ టీమ్ పెద్ద షాకే ఇచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా స్పెషల్ ట్రీట్ ఉంటుందని ఆశించిన అభిమానులకు అంచనాలకు మించి ట్విస్ట్ అందించింది. రెండు నిమిషాల మోషన్ పోస్టర్ లో మొదటిసారి డార్లింగ్ లుక్ ని చాలా విభిన్నంగా రివీల్ చేసింది. తెల్లబడిన గెడ్డం, అక్కడక్కడా రంగు నెరసిన జుట్టు, నోట్లో దొరలు తాగే పాత కాలం చుట్ట వెరసి ఊహించని రీతిలో రివీల్ చేసింది. వీడియోలో లైవ్ విజువల్స్ లేకపోయినా హారర్ కాన్సెప్ట్ ని యానిమేషన్ రూపంలో డిజైన్ చేసి దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని జోడించడం కొత్తగా ఉంది.
సబ్జెక్టు లైన్ గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ది రాజా సాబ్ ఒక కంప్లీట్ హారర్ కామెడీ మూవీ. చూస్తుంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి యంగ్ గా అమ్మాయిల మనసులు దోచేసే వింటేజ్ లుక్ కాగా మరొకటి పాడుబడిన బంగాళాను ఒకప్పుడు రాజ్యమేలిన రాజుల కాలం నాటి మహారాజ్ లుక్. రెండూ దేనికవే ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. దర్శకుడు మారుతీ తాను ఎలాంటి సబ్జెక్టు హ్యాండిల్ చేశానో స్పష్టత ఇచ్చేసినట్టే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో రూపొందించిన ది రాజా సాబ్ కు నాలుగు వందల కోట్ల దాకా బడ్జెట్ అయ్యిందనే టాక్ ఉంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతున్న ది రాజా సాబ్ కు సంబంధించి ఎలాంటి ఆలస్యం ఉండబోవడం లేదు. ఈ ఏడాది చివర్లోగా షూటింగ్ పూర్తి చేసి తర్వాత మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ , ప్రమోషన్ కు కేటాయించబోతున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ డ్రామాలో సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రభాస్ తర్వాతి రిలీజ్ ఇదే కావడంతో బిజినెస్ పరంగా అప్పుడే క్రేజ్ మొదలయ్యింది. అందులోనూ కల్కి 2898 ఏడి లాంటి బ్లాక్ బస్టర్ చూశాక డార్లింగ్ చేసిన సినిమా కనక ప్రతి విషయంలోనూ మారుతీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
This post was last modified on October 23, 2024 5:38 pm
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…