బాలీవుడ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ మూవీ.. సింగమ్ అగైన్. తమిళ చిత్రం ‘సింగమ్’కు రీమేక్‌గా అజయ్ గేదవగణ్ హీరోగా అదే పేరుతో తెరకెక్కిన సినిమా గతంలో సూపర్ హిట్ కాగా.. దానికి కొనసాగింపుగా ‘సింగమ్ రిటర్న్స్’ తీశాడు రోహిత్ శెట్టి. అది కూడా విజయం సాధించడంతో ‘సింగమ్ అగైన్’ అంటూ మరో సినిమా రూపొందించారు. ఈసారి ‘సింగమ్’ కోసం చాలామంది స్టార్లను తీసుకొచ్చారు.
అజయ్ దేవగణ్ సరసన కరీనా కపూర్ నటించగా.. రోహిత్ తీసిన వేర్వేరు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేసిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలతో పాటు టైగర్ ష్రాఫ్, విక్కీ కౌశల్ ఇందులో స్పెషల్ క్యామియోలు చేశారు. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్లో వీళ్లంతా సందడి చేశారు. కానీ ఈ క్యామియోలు ఓవర్ ద టాప్‌గా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి.
కానీ రోహిత్ మాత్రం సినిమాకు క్యామియోలు బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నాడు. ఐతే ఇంతమంది ఉన్నా సరిపోరంటూ.. ట్రైలర్లో కనిపించని ఇంకో టాప్ స్టార్ క్యామియోను కూడా సినిమాకు జోడిస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడితో రోహిత్‌కు మంచి అనుబంధమే ఉంది. సల్మాన్ కెరీర్లో బిగ్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ‘దబంగ్’లో చుల్ బుల్ పాండే పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అదే పాత్రను ‘సింగమ్ అగైన్’ కోసం వాడుకుంటున్నారు.
ఇటీవల తనను హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ కొన్ని రోజులు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. తర్వాత ‘బిగ్ బాస్’ కోసం బయటికి వచ్చాడు. ఇప్పుడు ‘సింగమ్ అగైన్’ షూట్‌లోనూ పాల్గొంటున్నాడట సల్మాన్. సల్మాన్ పార్ట్ పది రోజుల ముందే షూట్ చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయాలనుకున్నారు. కానీ సల్మాన్ బ్రేక్ తీసుకోవడంతో అది అలాగే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇప్పుడు ఆ పని పూర్తి చేస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 1న ‘సింగమ్ అగైన్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 23, 2024 11:19 am
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…