దక్షిణాదిన గొప్ప నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలూ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది నిత్య. ఐతే ఆమె గతంలో ఎన్నో గొప్ప సినిమాలు, పాత్రలు చేసినా.. వాటిని కాదని ‘తిరు’ అనే మామూలు సినిమాకు ఆమెకు జాతీయ పురస్కారం దక్కింది. ‘తిరు’ లాంటి సగటు కమర్షియల్ సినిమాలో పాత్రకు జాతీయ అవార్డు ఏంటి అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఐతే అవార్డులు ప్రకటించి రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఆ విషయంలో తాను విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నానని నిత్య చెప్పింది.
“అవును. ఇప్పటికీ నాకు వచ్చిన జాతీయ అవార్డు గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఐతే జ్యూరీ సభ్యులు నాకు ఎందుకీ అవార్డు ఇచ్చారో వాళ్లను కలిశాకే అర్థమైంది. నాకు అవార్డును ప్రకటించాక జ్యూరీ సభ్యుల్లో కొందరిని కలిశాను. అప్పుడే తెలిసింది.. వాళ్లు కేవలం ఈ ఒక్క సినిమా కోసం నాకు అవార్డు ఇవ్వలేదని. నాలో ఉన్న కళాకారిణిని, నా కెరీర్‌ను చూసి ఈ వార్డు ఇచ్చారని. అందుకే ఈ అవార్డును చాలా గొప్పగా భావిస్తాను” అని నిత్య వెల్లడించింది.
తన లుక్స్ విషయంలో కూడా తరచుగా తాను విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటానని నిత్య తెలిపింది. తనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటానని.. కొన్ని సినిమాల్లో తాను ఇలాగే కనిపించాలని చెబుతుంటారని.. వాటికి తాను ఎప్పుడూ లొంగలేదని నిత్య చెప్పింది. ‘మీరు బరువు పెరిగారు’ అనే కామెంట్‌ను తాను తరచుగా వింటూ ఉంటానని.. మనస్ఫూర్తిగా అభినందించే వాళ్లు తక్కువ అని నిత్య ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా పాత్ర ఎంచుకునేటపుడు అందుకు తాను నప్పుతానా అనేది మాత్రమే చూస్తానని.. సినిమా రిజల్ట్ గురించి ఆలోచించని.. కథ అర్థం కాకపోతే ఏ సినిమాలోనూ నటించనని నిత్య స్పష్టం చేసింది.
This post was last modified on October 23, 2024 10:26 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…