దీపావళికి స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా కంటెంట్ నమ్ముకున్న విభిన్న చిత్రాలు పోటీలో ఉన్నాయి. దుల్కర్ సల్మాన్, కిరణ్ అబ్బవరంలు విభిన్న ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వీళ్లకు తోడుగా కాంపిటీషన్ లో శివ కార్తికేయన్ ఉన్నాడు. అమరన్ కూడా అక్టోబర్ 31నే లక్కీ భాస్కర్, ‘క’తో పాటుగా రిలీజవుతోంది. ఇప్పటికైతే తెలుగు వెర్షన్ కు సంబంధించి ఎలాంటి సౌండ్ లేదు. రేపు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. సాయిపల్లవి హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ లో తనకున్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకోకుండా తెలుగు వెర్షన్ ప్రమోషన్లు ఇంకా మొదలుపెట్టలేదు.
టైటిల్ కూడా వేట్టయన్ దారిలో అమరన్ అని యధాతథంగా ఉంచేశారు. తెలుగు ఆడియన్స్ సౌలభ్యం కోసమైనా పేర్లు మార్చే ఉద్దేశంలో తమిళ నిర్మాతలు కనిపించడం లేదు. పోనీ ఇక్కడ హక్కులు కొన్న వాళ్ళు ఏమైనా సలహా ఇవ్వడమో ఒత్తిడి చేయడమో చేస్తారా అంటే అదీ లేదు. అడిగితే ప్యాన్ ఇండియా సినిమాలకు బాషా హద్దులు ఉండవని అంటారు. మరి కార్తీ మూవీకి సత్యం సుందరం అని ఎందుకు మార్చారో ఎవరూ చెప్పలేరు. దీని సంగతి పక్కనపెడితే అమరన్ ఫోకస్ తమిళనాడు మీదే ఎక్కువగా ఉంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజజీవిత కథ ఆధారంగా రూపొందింది.
కమల్ హాసన్ దీనికి నిర్మాణ భాగస్వామ్యం వహించగా రాజకుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. శివ కార్తికేయన్ తెలుగు పబ్లిసిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడు. డాక్టర్, డాన్ ఇక్కడ కమర్షియల్ గా సక్సెస్ కాగా ప్రిన్స్ నిరాశపరిచింది. మహావీరుడు పర్వాలేదనిపించింది. అయలాన్ మాత్రం సాంకేతిక కారణాల వల్ల డబ్బింగ్ జరగకుండానే ఆగిపోయింది. తిరిగి ఇంత గ్యాప్ తో అమరన్ తో వస్తున్నాడు. విజయ్, సూర్య అంత మార్కెట్ ఇక్కడ లేదు కానీ కంటెంట్ బాగుంటే జనం హిట్ ఇస్తారు కాబట్టి టాక్ నే నమ్ముకున్నాడు. లక్కీ భాస్కర్ కంపోజ్ చేసిన జివి ప్రకాష్ కుమార్ దీనికీ సంగీతం అందించాడు.
This post was last modified on October 22, 2024 5:59 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…