Movie News

మామా అల్లుడి కలయికతో జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్ కు తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కు కొనసాగింపుగా పార్ట్ 2 తాలూకు స్క్రిప్ట్ ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సిద్ధం చేస్తున్నారు. కూలి షూటింగ్ లో తలైవర్ బిజీగా ఉన్న కారణంగా ఇంకా బోలెడు టైం ఉండటంతో తుదిమెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు.

అయితే వెంటనే ఉంటుందా లేక టైం పడుతుందా అనేది తెలియదు కానీ నెల్సన్ మాత్రం జైలర్ 2 తో పాటు వేరే కథలు సిద్ధం చేసుకుని ఇతర స్టార్లను కలుసుకునే ప్లాన్లతో వర్కౌట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మీటింగ్ అయ్యిందనే టాక్ ఉంది కానీ ఎలాంటి ధృవీకరణ రాలేదు.

ఇక జైలర్ 2 ఒక అరుదైన కలయికకు శ్రీకారం చుట్టబోతోందని తెలిసింది. మామ అల్లుడు ఇందులో భాగం కాబోతున్నారట. అంటే రజనీకాంత్, ధనుష్ కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారని చెన్నై న్యూస్. అదిరిపోయే క్యామియోలు చేసిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ను కొనసాగిస్తూనే ధనుష్ కోసం ప్రత్యేక పాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది.

మొదటి భాగంలో కొడుకు చనిపోతాడు కాబట్టి వేరే సంతానం లేని జైలర్ కు మరో అండ అవసరం. ఆ క్యారెక్టర్ లోనే ధనుష్ ఎంట్రీ ఉంటుందని, పూర్తి పాజిటివ్ సైడ్ లో మరిన్ని ఎలివేషన్లతో విజిల్స్ వేయించే రేంజ్ లో ఎపిసోడ్స్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం.

నిజానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయాక తిరిగి కలుసుకునే దాఖలాలు కనిపించలేదు. అలాని రజనికి అల్లుడి మీద ఎలాంటి కోపం లేదని పలు సందర్భాల్లో బయట పడింది. అందుకే జైలర్ 2 కోసం ఇలా అనుకుంటున్నానని నెల్సన్ చెప్పగానే ఓకే అన్నారట. కూలి షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నాక కొంత అస్వస్థతకు గురైన రజనీకాంత్ తిరిగి మాములు స్థితికి వచ్చేశారు.

ఈ నెలలోనే బ్యాలన్స్ పూర్తి చేస్తారు. సినిమాలు చేసే విషయంలో స్పీడ్ తగ్గించే సమస్యే లేదని డాక్టర్లు, కుటుంబ సభ్యులకు చెబుతున్నారట. అంతేమరి నటనకు అలవాటు పడిన ప్రాణం విశ్రాంతి ఎందుకు కోరుకుంటుంది.

This post was last modified on October 22, 2024 3:39 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

36 minutes ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

38 minutes ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

4 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

5 hours ago