బ్లాక్ బస్టర్ ఓటిటి టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 ఈ శుక్రవారం మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని తీసుకురావడం అంచనాలు పెంచింది. సీఎం అయ్యాక ఒక టీవీ షో కెమెరా ముందుకు బాబు రావడం ఇదే మొదటిసారి. గతంలోనే ఈ కలయిక జరిగినప్పటికీ ఈసారి విజేతలుగా బావా బావమరిది సంభాషణ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అన్ని వర్గాల్లో ఉంది. దానికి మరింత స్పష్టత ఇచ్చేందుకు ఆహా టీమ్ ప్రత్యేకంగా 5 నిమిషాల కొత్త ట్రైలర్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టే బాలయ్య, బాబుల మధ్య బోలెడు ముచ్చట్లు ఉన్నాయని అర్థమైపోయింది.
ఊహించినట్టే చంద్రబాబు యాభై రోజులకు పైగా జైల్లో గడిపిన సంఘటన తాలూకు చర్చ ఇద్దరి మధ్య ఎమోషనల్ గా సాగింది. పవన్ కళ్యాణ్ వచ్చి కలిశాక జైలు గోడల మధ్య జరిగిన సమావేశం తాలూకు వివరాలు కూడా బాలయ్య ఈ సందర్భంగా అడిగేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రస్తావనతో పాటు మనవడు దేవాన్ష్ తో బాబు చిన్నప్పుడు చేసిన ఏదైనా అల్లరి ఘటన గురించి అడిగే వీడియో కూడా ఇందులో పొందుపరిచారు. వీటితో పాటు ఒక అయిదు వందల రూపాయలు షాపింగ్ కోసమని చంద్రబాబుకి ఇస్తే సూపర్ మార్కెట్ కి వెళ్లి ఏం కొంటారనే వైరెటీ ఐడియాని ఎపిసోడ్లో అమలుపరిచారు. సరదా సెటైర్లు కూడా పడ్డాయి.
ఇవి చాలవు అన్నట్టు కొన్ని రొమాంటిక్ సినిమాల ముచ్చట్లు బాబు, బాలయ్య మధ్య దొర్లాయి. కాంబో రిపీట్ అయినా సరే ఖచ్చితంగా చూడాలన్న ఇంటరెస్ట్ రప్పించడంలో ఆహా బృందం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. నాలుగో సీజన్ మొదటి భాగం కావడంతో హైప్ బాగా ఉంది. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులతో పాటు బాలయ్య, పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ తో వ్యూస్ భారీ ఎత్తున వచ్చేలా ఉన్నాయి. ఇది కేవలం సాంపిల్ కాబట్టి కొన్నే చూపించారు కానీ అసలు కంటెంట్ దాచే ఉంటారు. ఇదే టెంపో టాక్ షో మొత్తం కొనసాగి ఉంటే మాత్రం మరో సూపర్ హిట్ సీజన్ బాలయ్య ఖాతాలో పడినట్టే.
This post was last modified on October 22, 2024 2:25 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…