విడుదల తేదీ డిసెంబర్ 6 దగ్గరపడే కొద్దీ ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలలో పుష్ప 2 ది రూల్ గురించిన అంచనాలు అంతకంతా పెరుగుతూ పోతున్నాయి తప్పించి ఇంచు కూడా తగ్గడం లేదు. ట్రైలర్ రాలేదు. ఐటెం సాంగ్ ఎలా ఉంటుందో ఐడియా లేదు. ఒకటి రెండు విజువల్స్, పోస్టర్స్ తప్ప అసలైన కంటెంట్ వదల్లేదు. అయినా సరే పుష్ప 2 మాత్రం తగ్గేదేలే అంటూ అరాచకం చూపిస్తున్నాడు. మొదటి భాగం వచ్చిన టైంలో హిందీ వెర్షన్ యూట్యూబ్ లేదా శాటిలైట్ లో వస్తే చాలన్న బాలీవుడ్ నిర్మాత మాటను తప్పని రుజువు చేయడం దగ్గరి నుంచి ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ కోసం కొట్టుకునేలా చేయడం బన్నీకే చెల్లింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచే పుష్ప 2 వెయ్యి కోట్ల మార్కు దాటిందనే వార్త ఇప్పుడు దావానలంలా ఆన్ లైన్, మీడియాని ఊపేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా లీకవుతున్న సోర్స్ నుంచి వస్తున్న నెంబర్లు మతిపోగొట్టేలా ఉన్నాయి. ఏపీ తెలంగాణ కలిపి రెండు తెలుగు రాష్ట్రాలకు సుమారు 220 కోట్ల దాకా బిజినెస్ అయ్యిందనే టాక్ ఇప్పటికే తెలిసిన విషయమే. ఇతర లెక్కలు చూస్తే నార్త్ వెర్షన్ 200 కోట్లు, తమిళనాడు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ 20 కోట్లు, ఓవర్సీస్ 120 కోట్లు దాకా థియేటర్ హక్కుల రూపంలో సమకూరినట్టు ట్రేడ్ టాక్. మొత్తం 640 కోట్ల దాకా తేలుతుంది.
నాన్ థియేట్రికల్ చూసుకుంటే ఓటిటి 275 కోట్లు, మ్యూజిక్ ఆల్బమ్ 65 కోట్లు, శాటిలైట్ అన్ని భాషలు కలిపి 85 కోట్ల దాకా అయ్యిందట. టోటల్ లెక్క చూసుకుంటే 1065 కోట్ల దాకా ఉంది. ఇవి ఖచ్చితమైన వాస్తవాలని చెప్పలేం కానీ క్రేజ్ దృష్ట్యా చూస్తుంటే నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. కల్కి 2898 ఏడి, దేవరకు ఇతర భాషల్లో ఎప్పుడూ చూడనంత డిమాండ్ ఏర్పడలేదు. కానీ పుష్పకు అలా కాదు. హిందీ, మలయాళంలోనూ విపరీతమైన హైప్ ఉంది. ఇదంతా చూస్తుంటే సహస్ర కోట్లను మంచినీళ్లలా తాగేసిన పుష్ప అంత మొత్తం బాక్సాఫీస్ దగ్గర రాబడితే మాత్రం కనివిని ఎరుగని సంచలనమే అవుతుంది.
This post was last modified on October 22, 2024 11:18 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…