వయసు పెరిగే కొద్దీ హీరోల లుక్స్ మారుతుంటాయి. యుక్త వయసులో ఉన్నంత ఆకర్షణీయంగా తర్వాత కనిపించలేరు. లుక్స్ పరంగా కొన్ని సినిమాల్లో హీరోలు ది బెస్ట్ అనిపిస్తారు. అభిమానులేమో మళ్లీ అంతే ఆకర్షణీయంగా హీరోలు కనిపించాలని కోరుకుంటారు. కానీ అదంత ఈజీ కాదు.
రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే.. తన కెరీర్లో బెస్ట్ లుక్స్ ఉన్న సినిమా ఏది అంటే మరో మాట లేకుండా మిర్చి పేరు చెప్పేస్తారు. ఆ చిత్రంలో తొలిసారి పల్లెటూరిలో అడుగు పెట్టిన ప్రభాస్‌ను చూసి అనుష్క ఏమున్నాడ్రా బాబూ అంటుంది. ఆ కామెంట్ ప్రేక్షకులు కూడా నిజంగానే ఫీలై ఉంటారనడంలో సందేహం లేదు. అమ్మాయిలు మిర్చి లుక్‌లో ప్రభాస్‌ను చూసి ఫిదా అయిపోయారు. దాని తర్వాత బాహుబలిలో కూడా ప్రభాస్ అందంగా కనిపించాడు కానీ.. అది వేరే తరహా సినిమా. ప్రభాస్ మిర్చిలో మాదిరి స్టైలిష్‌గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు.
కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాల్లో తన లుక్స్ ఏమంత ఆకర్షణీయంగా కనిపించలేదు. ముఖ్యంగా లవ్ స్టోరీ అయిన రాధేశ్యామ్‌లో ప్రభాస్ కనిపించిన తీరు విమర్శలకు దారి తీసింది. అంతకుముందు సాహోలో, తర్వాత ఆదిపురుష్‌లో కూడా ప్రభాస్ లుక్స్ బాగా లేవనే కామెంట్లు వినిపించాయి. అతను మెయింటైనెన్స్ పక్కన పెట్టేశాడని.. వయసు ప్రభావం కూడా పడి లుక్స్ తేడా కొట్టేశాయని.. ఇక మళ్లీ ప్రభాస్‌ను ఆకర్షణీయమైన లుక్స్‌లో చూడలేమా అని అభిమానులు నిట్టూర్చారు.
ఐతే సలార్, కల్కి చిత్రాల్లో తన లుక్స్ కొంచెం మెరుగుపడ్డాయి. అయినా సరే మునుపటి ఛార్మ్ అయితే కనిపించలేదు. కానీ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్‌లో మాత్రం ప్రభాస్ భలే అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లో ప్రభాస్ బాగా కనిపించాడు. ఇక ఇంకో రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టిన రోజు రానున్న నేపథ్యంలో తాజాగా రాజా సాబ్ నుంచి ఒక పోస్టర్ వదిలారు. అందులో నాజూగ్గా, ఇప్పటి ట్రెండుకు తగ్గ స్టైలింగ్‌తో ప్రభాస్ వారెవా అనిపించాడు. ఒక్కసారిగా పదేళ్ల వయసు తగ్గినట్లు అనిపించాడు. ఈ లుక్ చూసి మిర్చి తర్వాత ప్రభాస్ కెరీర్లోనే బెస్ట్ లుక్, స్టైలింగ్ రాజా సాబ్‌లోనే చూడబోతున్నట్లుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on October 21, 2024 11:19 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…