సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. వాళ్ల ఇళ్లలో ఏం జరిగినా వార్తే. వాళ్ల పట్ల జనాల్లో ఉండే క్యూరియాసిటీని క్యాష్ చేసుకోవడానికి మీడియా, సోషల్ మీడియా జనాలు ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన సమయంలో కూడా సున్నితత్వం కోల్పోయి ప్రవర్తించడమే దారుణం. ముఖ్యంగా సెలబ్రెటీలు తమకు ఎంతో ముఖ్యమైన కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నపుడు మీడియా, సోషల్ మీడియా జనాలు కవరేజీ కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందికరంగా మారుతుంటాయి.
తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన తల్లిని కోల్పోయిన సందర్భంగా ఆయన ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్ పెద్ద ఎత్తున గుమిగూడారు. వీడియోల కోసం పోటీ పడ్డారు. రీల్స్ చేసుకునే మామూలు జనాలు కూడా శ్రుతి మించి ప్రవర్తించారు.
ఈ విషయమై కిచ్చా సుదీప్ కుమార్తె శాన్వి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ ఇంటి వద్ద వీడియోల కోసం జనం హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల తన నాయనమ్మకు సరైన వీడ్కోలు కూడా ఇవ్వలేకపోయానని ఆమె పోస్ట్ పెట్టింది. “నాయనమ్మను కోల్పోయిన దు:ఖంలో నేనుంటే కొందరు వ్యక్తులు నా ముఖం మీద కెమెరాలు పెట్టారు. బాధలో ఉన్న వ్యక్తితో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారని నాకు ఇప్పటి వరకు తెలయిదు. వారి కారణంలో నేను నా నాయనమ్మకు సరైన సెండాఫ్ ఇవ్వలేకపోయాను. నాన్నతో కూడా వాళ్లు ఇలాగే ప్రవర్తించారు. ఆయన ఏడుస్తుంటే జనాలు నెట్టేశారు. కొందరు ఆయన మీద పడి లాగడం మొదలుపెట్టారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. వారికి రీల్స్ మీద ఉన్న శ్రద్ధ మరొకరి ఎమోషన్లను అర్థం చేసుకోవడంలో లేదు” అని శాన్వి ఆవేదన వ్కక్తం చేసింది.
కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అమ్మకు నివాళిగా తీవ్ర భావోద్వేగంతో సుదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
This post was last modified on October 21, 2024 3:55 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…