ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్రాంజైజీ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ‘మున్నాభాయ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది.
ఆ తర్వాత హిరాని ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘనవిజయం సాధించింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ తీయాలని హిరాని-సంజు ఎప్పుడో అనుకున్నారు. కానీ అది ఎంతకీ పట్టాలెక్కడం లేదు.
ఐతే ఎట్టకేలకు హిరాని మున్నాభాయ్-3 తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన తర్వాతి చిత్రం అదే కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చాడు. అంతే కాక ‘మున్నాభాయ్-3’ కోసం ఐదు వేర్వేరు స్క్రిప్టుల మీద పని చేసినట్లు హిరాని వెల్లడించడం విశేషం.
‘మున్నాభాయ్ ఛలే అమెరికా’ పేరుతో పార్ట్-3 తీయబోతున్నట్లు హిరాని అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాంతో పాటుగా తాను మరో నాలుగు స్క్రిప్టుల మీద పని చేశానని.. అవన్నీ కూడా సగం సగమే పూర్తయ్యాయని.. ఏదీ పూర్తి రూపం సంతరించుకోలేదని హిరాని వెల్లడించాడు.
ఇప్పుడు ఆ ఐదు స్క్రిప్టుల్లో ఒకటి ఎంచుకుని దాని మీద పూర్తి చేయాలని చూస్తున్నట్లు హిరాని తెలిపాడు. మున్నాభాయ్-3.. తొలి రెండు సినిమాల కంటే చాలా మెరుగ్గా ఉండాలన్నది తన లక్ష్యమని.. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నానని హిరాని తెలిపాడు.
సంజు త్వరలో తన దగ్గరికి వచ్చి స్క్రిప్టు త్వరగా పూర్తి చేయమని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలున్నట్లు హిరాని చమత్కరించాడు. ఈ సినిమా గురించి త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అరంగేట్రం చేసిన హిరాని.. ఆ తర్వాత లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి బ్లాక్ బస్టర్లు తీశారు. ఆయన చివరి చిత్రం ‘డంకి’ మాత్రం ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది.
This post was last modified on October 20, 2024 4:38 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…