ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వహాబ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్టవుతున్నారు. ఇప్పటిదాకా మదర్ క్యారెక్టర్స్ లో రిపీట్ ఆర్టిస్టులను చూసి బోర్ కొట్టేసిన ప్రేక్షకులకు పెద్దరికంతో ఆవిడ హుందాగా కనిపిస్తున్నారు.
దానికి తగ్గట్టే ఆఫర్లు వస్తున్నాయట. అయితే జరీనా వహాబ్ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. ఆవిడ స్వస్థలం విశాఖపట్నం. పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్ టిట్యూట్ లో శిక్షణ పొందాక బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించారు. 1974లో తొలిసారి హీరోయిన్ గా నటించారు.
లెజెండరీ నటులు రాజ్ కపూర్ ఆమె నటన, లుక్స్ మీద ఇచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ సీరియస్ గా తీసుకున్న జరీనా వహాబ్ తనను తాను మార్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. 1976లో బసు ఛటర్జీ తీసిన చిత్ చోర్ లో తొలి బ్రేక్ అందుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
1986లో నటుడు ఆదిత్య పంచోలిని పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గాజుల కిష్టయ్యతో 1975లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కమల్ హాసన్ అమర ప్రేమలో చేశారు. అక్కినేని-కృష్ణ మల్టీస్టారర్ హేమాహేమీ తర్వాత జరీనా వహాబ్ పూర్తిగా హిందీ, మలయాళం సినిమాలకు అంకితమయ్యారు.
2010 రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రతో మళ్ళీ కనిపించారు. రక్త చరిత్ర 2 వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెతికి మరీ ఆవిడను నాని దసరాతో రీ ఎంట్రీ చేయించాడు. జూనియర్ ఎన్టీఆర్ దేవరలోనూ మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులు యాడ్ అయ్యాయి. తెలుగు బాగా మాట్లాడ్డం వచ్చు కాబట్టే అంత సహజమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్నారట. ఫలితాల సంగతి పక్కనపెడితే ఈ రెండు సినిమాల్లోనూ జరీనా వహాబ్ పాత్ర బాగా ప్లస్ అయ్యింది. మెల్లగా నాన్నమ్మ, అమ్మ క్యారెక్టర్లకు ఈవిడ మంచి ఛాయస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on January 13, 2026 10:19 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…