ఇటీవలే విడుదలైన లవ్ రెడ్డికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కంటెంట్ పరంగా కొంత ప్రశంసలు దక్కిన మాటా నిజమే. అయితే థియేటర్ల దగ్గర జనం లేకపోవడం టీమ్ ని నిరాశ పరిచింది. అందుకే ఎన్నడూ లేనిది మొదటిసారి ఫెయిల్యూర్ మీట్ పేరుతో ఒక ఈవెంట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
నిజంగా సినిమా బాగుంటే కొంచెం నెమ్మదిగా అయినా ఆడియన్స్ ఆదరిస్తారని గతంలో ఎన్నోసార్లు రుజువైనప్పటికీ లవ్ రెడ్డి టీమ్ రెండో రోజే తమ నిరాశను వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల దక్కిన ప్రయోజనం ఏంటనేది పక్కపెడితే ఇంకో రూపంలో పెద్ద బూస్ట్ దక్కింది.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్స్ టా స్టేటస్ లో లవ్ రెడ్డి గురించి మంచిగా వింటున్నానని పోస్ట్ చేయడం ఒక్కసారిగా అభిమానులను అలెర్ట్ చేసింది. గతంలో డార్లింగ్ ఇలా ఎన్నోసార్లు చేశాడు కానీ అవన్నీ అంతో ఇంతో స్టార్ క్యాస్టింగ్ లేదా పెద్ద నిర్మాణ సంస్థలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కానీ లవ్ రెడ్డి విషయంలో అవేవీ లేవు.
అసలు కారణం ఏంటయ్యా అంటే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ చిత్రం గురించి ప్రభాస్ తో మాట్లాడుతూ చెబుతూ ఏదైనా ప్రోత్సాహం దక్కితే బాగుంటుందని అన్నారట. అంతే క్షణం ఆలోచించకుండా సీనియర్ అడిగారు కాబట్టి వెంటనే స్టేటస్ పెట్టేశాడు.
ఇలాంటి ఎంకరేజ్మెంట్ చిన్న సినిమాలకు కలిగించే లాభం మాములుగా ఉండదు. ఎలాగూ వీకెండ్ కాబట్టి యూత్ లవ్ రెడ్డి వైపు చూసేందుకు ప్రభాస్ మాటలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఊహించని క్లైమాక్స్ తో ఒక ప్రేమకథను ప్రెజెంట్ చేసిన లవ్ రెడ్డి తన ప్రమోషన్లలో చెప్పుకున్నట్టు నిజంగా బేబీ రేంజ్ లో ఉంటే పోటీ లేని బాక్సాఫీస్ వద్ద విజయం దక్కేది.
యావరేజా ఫ్లాపా అనేది పక్కనపెడితే తమ హీరో పెద్ద మనసు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఇంకో మూడు రోజుల్లో అక్టోబర్ 23 పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా ప్రభాస్ నిర్మాతల నుంచి బోలెడు అప్డేట్స్ రాబోతున్నాయి.
This post was last modified on October 20, 2024 2:42 pm
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…