ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. సొంత ప్రొడక్షన్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను అనౌన్స్ చేసింది కానీ.. అది ముందుకు కదులుతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.
ఐతే సమంతను త్వరలో బుల్లితెర పై చూడబోతున్నాం. ఆమె ముఖ్య పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సిరీస్ కూడా సమంత చేజారాల్సింది. ఈ సిరీస్ కోసం అడిగినపుడే సమంతకు మయోసైటిల్ వ్యాధి నిర్ధారణ అయింది.
దీంతో ఇందులో నటించడం కష్టమని సమంతే అనుకుందట. కానీ దర్శకులు రాజ్-డీకే హనీ పాత్రను సమంతే చేయాలని పట్టుబట్టి ఆమె అందుబాటులోకి వచ్చేవరకు ఎదురు చూసినట్లు సమంత స్వయంగా వెల్లడించింది.
ఐతే రాజ్-డీకే సమంత కోసం అంత పట్టుబడితే.. సమంతతో ఎందుకు నటించడం అంటూ చాలామంది హీరో వరుణ్ ధావన్‌కు సలహాలు ఇచ్చారట. బాలీవుడ్ హీరోలు సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌ల్లో నటించిన ముంబయి హీరోయిన్లనే జోడీగా ఎంచుకుంటారు.
వాళ్లకు దేశవ్యాప్త గుర్తింపు ఉంటుంది కాబట్టి మార్కెట్ పరంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. సౌత్ హీరోయిన్ల పట్ల అంతగా ఆసక్తి చూపించరు. ఈ ఉద్దేశంతోనో ఏమో.. చాలామంది తనకు సమంత కథానాయికగా వద్దని సలహాలు ఇచ్చారని వరుణ్ తెలిపాడు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్నే ఎంచుకోమని చెప్పారన్నాడు.
కానీ రాజ్-డీకేలతో పాటు తాను కూడా సమంత అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అని భావించి తననే ఎంచుకున్నట్లు వరుణ్ తెలిపాడు. వరుణ్ ఈ సిరీస్‌లో బన్నీ అనే పాత్రలో నటించాడు. ఇందులో వరుణ్-సామ్ సీక్రెట్ ఏంజెంట్లుగా కనిపించనున్నారు.
This post was last modified on October 20, 2024 11:02 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…