నిన్న జరిగిన పొట్టెల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో క్యాస్టింగ్ గురించి హీరోయిన్ అనన్య నాగళ్ళ అన్న మాటలు బాగా వైరలవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు తాను ఎప్పుడూ ఇది ఎదురుకోలేదని, ఇదంతా బుల్ షిట్ ప్రచారమంటూ ఇచ్చిన సమాధానం పేలింది. కమిట్ మెంట్ ఇస్తే ఒక రేటు ఇవ్వకపోతే ఒక రేటు పోకడ తెలుగు పరిశ్రమలో ఉందంటూ ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చాలా పరిణితితో అనన్య ఇచ్చిన ఆన్సర్ ఒకరకంగా చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఇది టాలీవుడ్ లో కన్నా ఎక్కువగా ఇతర ఇండస్ట్రీల్లో ఎక్కువ ఉందనేది కాదనలేని వాస్తవం.
ఇటీవలే అమ్మ రిపోర్ట్ కేరళలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చూశాం. మోహన్ లాల్ అంతటి సీనియర్ స్టారే రాజీనామా చేసే దాకా వెళ్ళింది పరిస్థితి. అంతకు ముందు దిలీప్ మీద లైంగిక ఆరోపణల కేసు చాలా దూరం వెళ్ళింది. తమిళంలో ఒక గీత రచయిత మీద, కన్నడలో ఒక స్టార్ హీరో మీద పబ్లిక్ గా అలిగేషన్లు రావడం కళ్లారా కనిపించింది. కానీ తెలుగులో అలాంటి దాఖలాలు లేవు. ఖడ్గంలో కృష్ణవంశీ చూపించినట్టు అంతర్గతంగా కొన్ని ఉండొచ్చు. జానీ మాస్టర్ ఇదే వివాదంలో ఉన్నారు. ఆ మాటకొస్తే రాజకీయాలు, క్రీడలు, ప్రభుత్వ రంగాలు ఎక్కడ చూసినా ఇలాంటి ఉదంతాలు ఉంటాయి.
కాబట్టి కేవలం దీన్ని ఒక్క టాలీవుడ్ కి పరిమితం చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అనన్య నాగళ్ళ మెచ్యూరిటీకి నెటిజెన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె నటించిన పొట్టెల్ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. 1980 ప్రాంతంలో ఒక గ్రామంలో నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని రూపొందినట్టు సమాచారం. చదువు ప్రాధాన్యత చెబుతూనే థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపారేస్తారని ఇన్ సైడ్ టాక్. అక్టోబర్ 25 విడుదల కాబోతున్న ఈ సినిమా తనకు పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది అనన్య నాగళ్ళ. ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొంటూ ప్రమోషన్ చేస్తోంది.
This post was last modified on October 19, 2024 11:59 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…