రాబోయే అక్టోబర్ 31 అమావాస్య ఉంది. దీపావళి పండగే అయినప్పటికీ కొన్ని సెంటిమెంట్లు కఠినంగా పాటించే వాళ్ళు ఏదైనా మొదలుపెట్టే విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు మరీనూ. ఆ రోజు విడుదల కాబోతున్న కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నిర్మాతలు ఈ కోణంలో విశ్లేషించుకుని ఒక రోజు ముందు ప్రీమియర్లు వేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 30 తేదీ సాయంత్రం నుంచే షోలు వేస్తామని నిర్మాత నాగ వంశీ గతంలోనే ప్రకటించగా, క వైపు నుంచి అధికారిక ప్రకటన ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది.
పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇది సరైన నిర్ణయమేనని చెప్పాలి. మరుసటి రోజు సెలవు కాబట్టి 30 సాయంత్రం, సెకండ్ షోలు హౌస్ ఫుల్స్ పడతాయి. ఇంకా చెప్పాలంటే 31న పండగ హడావిడి, పటాసులు కాల్చే పనిలో బిజీగా ఉండి జనం థియేటర్లకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. సో వాళ్లంతా ప్రీమియర్లకు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. అయితే ఇందులో రిస్క్ లేకపోలేదు. బలగం, మేజర్ లాగా టాక్ యునానిమస్ టాక్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. లేదూ మిస్టర్ బచ్చన్ లాగా తేడా కొడితే ఇబ్బంది. కానీ కిరణ్, దుల్కర్ ప్రొడ్యూసర్లలో విజయం పట్ల ఒక్క శాతం అనుమానం లేదు.
ఈ రెండు కాసేపు పక్కనపెడితే 31 విడుదలవుతున్న వాటిలో డబ్బింగ్ మూవీ అమరన్ ఉంది. సాయిపల్లవి హీరోయిన్ కావడంతో తెలుగులోనూ బజ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పైగా తెలుగు వెర్షన్ కోసం శివ కార్తికేయన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ప్రమోషన్లలో పాల్గొంటాడు. ప్రశాంత్ నీల్ రచన, పర్యవేక్షణ చేసిన కన్నడ అనువాదం బఘీరా మీద బజ్ ఎక్కువ లేదు కానీ హోంబాలే ప్రొడక్షన్ కాబట్టి తక్కువంచనా వేయలేం. ఇక సత్యదేవ్ జీబ్రా క్రమంగా హైప్ పెంచుతోంది. కానీ ఇది చాలదు. పబ్లిసిటీ వేగం పెంచాలి. మరి ఇక్కడ చెప్పిన మూడింటిలో ఏవి ప్రీమియర్లకు సై అంటాయో చూడాలి.
This post was last modified on October 19, 2024 12:12 pm
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…
రాజకీయాల్లోకి అఖిల భారత ఉద్యోగులు రావడం సహజం అయిపోయింది. ఉద్యోగాలు విరమణ చేసిన వారు కొందరు.. మధ్యలోనే పీక్ స్టేజ్లో…