హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బజ్ తెప్పించడం కష్టం. ఒకటి రెండు ఆడినంత మాత్రాన జనం వాటినే కోరుకుంటారనే గ్యారెంటీ లేదు. ఒకప్పుడు విజయశాంతి లాంటి వాళ్ళు చక్రం తిప్పారు కానీ ఇప్పుడంతా హీరో డామినేటెడ్ మార్కెట్. వాళ్ళ పేరు మీదే వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. హీరోయిన్ గ్లామర్ లేదా నటన అదనపు ఆకర్షణ అవుతుంది తప్పించి ఆమె కోసమే థియేటర్ కు వచ్చే వాళ్ళు తక్కువగానే ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఈ విషయంలో లక్కీ అని చెప్పాలి. ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే తననే ప్రధాన పాత్రలో పెట్టి చిత్రాలు తీసే దర్శకులు క్రమం తప్పకుండా వస్తున్నారు.
కరోనా టైంలో ‘పెంగ్విన్’తో పలకరించింది. హారర్ జానర్ లో రూపొందిన ఈ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజైనప్పటికీ ఆశించినంత గొప్ప స్పందన రాలేదు. ఆ తర్వాత ‘మిస్ ఇండియా’ అంటూ మరో పెద్ద మూవీ. ఇదీ తుస్సుమంది. కొంచెం గ్యాప్ తీసుకుని ‘గుడ్ లక్ సఖి’ అంటూ పలకరించింది. నగేష్ కుకునూర్ లాంటి న్యూ ఏజ్ డైరెక్టర్ తీసినప్పటికీ ఫలితం మాత్రం మారలేదు. తమిళంలో సాని కడియం తెలుగులో ‘చిన్ని’గా ఇంకో ఓటిటి ప్రయత్నం చేసింది. రిజల్ట్ సేమ్. ఆగస్ట్ లో ‘రఘు తాత’ అంటూ పలకరించింది. ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు. ఇటీవలే తెలుగు వెర్షన్ తో పాటు ఓటిటిలో వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.
కట్ చేస్తే ఇప్పుడు ‘రివాల్వర్ రీటా’గా ఇంకో ట్రయిల్ వేస్తోంది. టీజర్ చూస్తే ఏదో కొత్తగానే ట్రై చేసినట్టు అనిపిస్తోంది కానీ కాన్సెప్ట్ ఎక్కువ అర్థమవ్వకుండా టీమ్ జాగ్రత్తగా కట్ చేసింది. ఇదైనా అదృష్టం అందిస్తుందో లేదో చూడాలి. వరుణ్ ధావన్ తో నటించిన బేబీ జాన్ రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్ తేరి రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కీర్తి కొంచెం గ్లామర్ షో చేసిందని ముంబై టాక్. అది నిజమో కాదో తేలాలంటే డిసెంబర్ 25 దాకా ఆగాలి. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో వరసగా ఛాన్సులు దక్కించుకున్న కీర్తికి తిరిగి ఆ పెద్ద బ్రేక్ ఇస్తుందో లేదో రీటానే అడగాలి.
This post was last modified on October 18, 2024 3:14 pm
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…