విక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఎక్కడా ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ లోగా మొత్తం పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. బడ్జెట్ కూడా వందల కోట్లు డిమాండ్ చేసేది కాకపోవడంతో పనులన్నీ సాఫీగా అయిపోతున్నాయి. ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అతని భార్య, మాజీ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే డ్రామాకు క్రైమ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ జోడించిన రావిపూడి ఇందులో కమర్షియల్ అంశాల కంటే కామెడీకి పెద్ద పీఠ వేసినట్టు యూనిట్ లో పని చేసినవాళ్ల నుంచి వినిపిస్తున్న మాట.
ఎఫ్2, ఎఫ్3లో బోలెడు ఆర్టిస్టులున్నా సరే వెంకటేష్ తనదైన టైమింగ్ తో వాటిని నిలబెట్టిన తీరు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. వరుణ్ తేజ్ హీరో కావడంతో అతనికీ స్పేస్ దక్కింది. కానీ ఇప్పుడీ వెంకీ 76లో అలాంటి స్కోప్ లేకపోవడంతో మొత్తం భారం వెంకటేష్ మీదే పెట్టినట్టు తెలిసింది. చిత్రీకరణ జరుగుతున్న టైంలోనే టీమ్ సభ్యులు పగలబడి నవ్వడం పలు సందర్భాల్లో జరిగిందట. ముఖ్యంగా హీరోతో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి మధ్య నడిచే సీన్లు ఓ రేంజ్ లో పేలాయని ఊరిస్తున్నారు. ఇతర తారాగణంతో కాంబో సన్నివేశాలు సైతం ఇదే తరహాలో వచ్చాయట.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే. ఎలాగూ పండగ రిలీజనే ఉద్దేశంతో దీన్నే లాక్ చేసుకుందామనుకున్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ వల్ల తప్పుకోవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పేరు కూడా మారొచ్చని అంటున్నారు. అధికారికంగా ప్రకటన వచ్చే దాకా రామ్ చరణ్, వెంకటేష్ ఇద్దరూ సంక్రాంతి బరిలో ఉన్నట్టే లెక్క. రెండూ నిర్మిస్తున్న దిల్ రాజు నిర్ణయం ఏంటో తెలిశాకే క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ తీవ్రంగా నిరాశపరచడంతో వెంకటేష్ తిరిగి తన పాత స్కూల్ కి తిరిగి వచ్చేశారు.
This post was last modified on October 18, 2024 2:55 pm
సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…
సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…
ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…
ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…
దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…