అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై చర్చలు జరుపుతున్నా కూడా బయటకు చెప్పడం లేదు. ఇండస్ట్రీలో ఆనోట ఈనోట పడి లీక్ అవ్వడమే గాని సోషల్ మీడియాలో కూడా సౌండ్ చేయడం లేదు. ఆమధ్య కొత్త డైరెక్టర్ తోనే యూవీ క్రియేషన్స్ లోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో మరి దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.
ఇక మొన్నటివరకు పూరి జగన్నాథ్ కూడా అఖిల్ కోసం ప్రయత్నం చేయగా పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్. ఇప్పుడు ఫైనల్ గా అఖిల్ ఓ చిన్న దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా చేసిన యువ దర్శకుడు మురళీ కిషోర్ అని తెలుస్తోంది.
నాగార్జున స్వయంగా కథ విషయంలో నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇది తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియడ్ డ్రామాగా తెరికక్కనుందట. ప్రాజెక్టు ఖర్చు విషయంలో అసలు రాజీ పడకూడదని స్వయంగా నాగ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ బ్యానర్ లోనే సినిమాను నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నారు.
నాగ్ తలచుకుంటే అఖిల్ కోసం బడా దర్శకులను లైన్ లో పెట్టవచ్చు. కానీ అలా కాకుండా సింపుల్ గానే నేటితరం యువ దర్శకులకి ఛాన్స్ ఇస్తున్నారు. పాతకాలం బ్యాక్ డ్రాప్ కావున ఈసారి అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి యువ దర్శకుడు మురళి కిషోర్ ప్రాజెక్టును ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
This post was last modified on October 18, 2024 9:50 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…