కొన్ని శుక్రవారాలు సినీ ప్రియులకు చప్పగా అనిపిస్తాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ కు కళ్ళముందు బోలెడు ఆప్షన్లు కనిపిస్తున్నా దేని మీదా ఆసక్తి కలగని పరిస్థితి తలెత్తుతుంది. రేపటి లిస్టు చూస్తే అదే సందేహం రావడం సహజం. దసరా తర్వాత వస్తున్న వారం కావడంతో నిర్మాతలు ముందుస్తు ప్లానింగ్ లేక చెప్పుకోదగ్గ రిలీజులు పెట్టుకోలేదు. దీంతో ఆ అవకాశాన్ని వాడుకునేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. కౌంట్ అయితే ఉంది కానీ వీటిలో చాలా మటుకు పేర్లు కూడా ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జనం వీటివైపు తలెత్తి చూడలేరు.
టైటిల్ నుంచి కాస్త ఆకర్షణీయంగా ఉన్న లవ్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లో కేవలం యాభై రూపాయలకు స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారు. మీడియా షో కూడా పూర్తయ్యింది. బేబీ లాగా సర్ప్రైజ్ ఇస్తుందని టీమ్ అంటోంది కానీ ఎంతమేరకు నిజమో రేపు తేలనుంది. ఇది కాకుండా రివైండ్, వీక్షణం, కల్లు కాంపౌండ్ 1995, ది డీల్ అంటూ మరికొన్ని చిన్న చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. దేనికీ అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో లేవు. ఏడాది తిరక్కుండానే సలార్ పార్ట్ 1 కి స్పెషల్ షోలు వేస్తే అవి మాత్రం ఫుల్ అవుతున్నాయి. కృష్ణవంశీ ఖడ్గంకి స్పందన బాగుండే సూచనలున్నాయి.
మిస్టర్ పర్ఫెక్ట్, ఈశ్వర్, రెబెల్ ఇలా మూకుమ్మడిగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజుల ముప్పేటదాడి జరుగుతోంది. ఈ లెక్కన వీకెండ్ లో తిరిగి దేవరనే పుంజుకున్నా ఆశ్చర్యం లేదు. దసరాకొచ్చిన సినిమాలన్నీ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉన్నాయి. మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక ఎలాంటి పికప్ చూపించలేదు. విశ్వం వసూళ్ల పరంగా కొంత రాబట్టినా ఫ్లాపు ముద్ర నుంచి తప్పించుకునేందుకు అవి సరిపోలేదు. మార్టిన్, జిగ్రా వాషౌట్ అయిపోయాయి. వేట్టయన్ ప్రభావం తొలి రెండు రోజులకే పరిమితమయ్యింది. తిరిగి దీపావళి దాకా ఈ డ్రై పీరియడ్ లో ఎలాంటి మార్పు ఉండదు.
This post was last modified on October 17, 2024 3:49 pm
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…
వైసీపీ అధినేత జగన్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయనను అరెస్టు చేయొచ్చా.? అది తప్పితే.. ఆయన…