ప్రస్తుత ట్రెండ్ లో మాస్ కమర్షియల్ దర్శకులుగా నిలదొక్కుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడు ఈ ఫార్మాట్ లో హిట్టు కాకపోయినా నష్టాలు రాకుండా సేఫ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కాస్త తేడా కొడితే దారుణమైన నష్టాలు కూడా వస్తున్నాయి. బి.గోపాల్ – వినాయక్ లాంటి వాళ్ళు నేటితరం మాస్ ఆడియెన్స్ అంచనాలను అందుకోలేక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
కానీ అదే ట్రాక్ లో వెళుతున్న బోయపాటి, బాలయ్య పవర్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేరే హీరోతో చేస్తే ఫలితం రివర్స్ అవుతున్నా బాలయ్యతో మాత్రం 100% స్ట్రైక్ రేట్ ఉంది. దీంతో అఖండ 2పై అంచనాలు గట్టిగానే పెరిగాయి. ఇక బోయపాటి కెరీర్ మొదటి నుంచి కూడా బడ్జెట్ విషయంలో ట్విస్టులు ఇస్తాడనే టాక్ ఉంది. పర్ఫెక్షన్ కోసం యాక్షన్ సన్నివేశాలకు భారీగా ఖర్చు చేస్తాడు. అందుకే ప్రతీసారి రెమ్యునరేషన్ లో కోతలు కూడా ఎదుర్కొన్నాడు.
నిర్మాతలతో గొడవ పడలేక సినిమా అవుట్ ఫుట్ బాగుండాలి అని రెమ్యునరేషన్ తగ్గించిన సందర్భాలు చాలానే ఉన్నాయట. ఇక అఖండ టైమ్ లో అయితే అసలు రెమ్యునరేషన్ లేకుండా ప్రాఫిట్ లో షేర్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాకు కూడా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యింది. అది హిట్టయ్యింది కాబట్టి ఓకే. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక ఇప్పుడు అఖండ 2: తాండవం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్.
ఇక ఈసారైనా బోయపాటి అనుకున్న బడ్జెట్ లో సినిమా ఫినిష్ చేస్తాడా లేదా అన్నది అసలు ప్రశ్న. ప్రతీసారి ఒక బడ్జెట్ అనుకుంటే దానిపైనే ఎంతోకొంత పెరుగుతోంది. అయితే ఈసారి అలాంటి సమస్య రాకుండా బాలయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. కూతురి సమర్పణలో వస్తోంది కాబట్టి ముందుగానే బడ్జెట్ హద్దులు దాటకుండా లైన్ గీసే ఉంటారు. అలాగే మార్కెట్ కు మించిన సాహసం కావున బోయపాటి సైతం ఆ లైన్ క్రాస్ చేయకపోవచ్చు.
This post was last modified on October 17, 2024 3:55 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…