Movie News

ఓటిటిలో మత్తు…..మరింత పెరుగుతోంది

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఓటిటిలో వచ్చాక స్పందన వేరుగా ఉంటుంది. నెగటివ్ గా కనిపించినా ఆశ్చర్యం లేదు. కొన్నేళ్ల క్రితం జాతిరత్నాలు ముప్పై కోట్లకు వసూలు చేసి డిజిటల్ లోకి వచ్చాక ట్రోలింగ్ చేసిన వాళ్లే ఎక్కువ. ఇదెలా ఆడిందనే కామెంట్స్ వచ్చాయి. హనుమాన్, కల్కిలను సైతం ఇలా అన్నవాళ్ళు లేకపోలేదు. కానీ మత్తు వదలరా 2 కేసు వేరుగా నిలుస్తోంది. క్రేజీ సీక్వెల్ గా థియేటర్లలో రిలీజైనప్పుడు మంచి స్పందన తెచ్చుకుని లాభాలు మూటగట్టుకున్న ఈ పార్ట్ టూ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం మొదలైంది. అసలు కథ ఇక్కడ షురూ అయ్యింది.

కమెడియన్ సత్య విశ్వరూపాన్ని పెద్ద తెరపై మిస్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఓటిటిలో షాకవుతున్నారు. ఆల్రెడీ చూసిన నెటిజెన్లు అందులో తమకు నచ్చిన క్రేజీ సీన్లను కట్ చేసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తల్లి కూతుళ్ళ వరస గురించి అజయ్ తో సత్య జరిపే సంభాషణ, రాజశేఖర్ మనసున్న మారాజు సినిమాలో పాటకు సత్య చేసే డాన్స్, ఓరి నా కొడకా సీరియల్ కామెడీ ఎపిసోడ్, చివర్లో సత్య చేసే చిరంజీవి నృత్యం ఇవన్నీ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ఇంత ఫన్ ఉందాని ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే ఓటిటిలో షో వేసుకుంటున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే మత్తు వదలరా 2కి ధ్వజ స్థంభంలా నిలబడ్డ సత్య దీని దెబ్బతో డిమాండ్ అమాంతం పెంచేసుకున్నాడు. హీరో శ్రీసింహ కోడూరినే అయినప్పటికీ హైలైట్ అయ్యింది మాత్రం సత్యనే. ఇప్పుడు ఎక్స్ మాధ్యమంలో ఫ్యాన్స్ తననే ఎంజాయ్ చేస్తున్నారు. మత్తు వదలరాలోనే పేరు తెచ్చుకున్న సత్యకు ఇప్పుడొచ్చింది మాత్రం డబుల్ ట్రిపుల్ డోస్ లో. దర్శకుడు రితేష్ రానాకు హ్యాపీ బర్త్ డే ఇచ్చిన డిజాస్టర్ గాయం పూర్తిగా మానినట్టే. మూడో భాగం తీస్తానని చెబుతున్నారు కానీ వెంటనే ఉంటుందా లేక ఇంకో వేరే సినిమా తీశాక కొనసాగిస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

This post was last modified on October 17, 2024 11:06 am

Share

Recent Posts

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

45 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

2 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

3 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 hours ago