కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తర్వాత కాస్త స్పీడ్ పెంచినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ అనే మూవీ చేస్తున్నారు. షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి కమల్ హాసన్ కథ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత మణిరత్నం సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేస్తాడనే ప్రచారం నడుస్తోంది.
ఇప్పటికే మణిరత్నం రజినీకాంత్ కి స్టొరీ నేరేట్ చేసాడని కూడా కథనాలు వినిపించాయి. 33 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కబోతోందని టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ కాంబినేషన్ పై మణిరత్నం వైఫ్, సీనియర్ యాక్టర్ సుహాసిని స్పష్టత ఇచ్చారు. ‘ఈ విషయం వారిద్దరికి కూడా తెలియదు. కేవలం వారిద్దరి కాంబోలో సినిమా వస్తోందని ప్రచారం చేసిన వారికి మాత్రమే తెలుసు’ అంటూ పరోక్షంగా కౌంటర్ వేసారు.
దీంతో మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్ లో సినిమా లేదని స్పష్టత వచ్చింది. మణిరత్నం ఫోకస్ అంతా ప్రస్తుతం కమల్ హాసన్ తో చేస్తోన్న ‘థగ్ లైఫ్’ మీద మాత్రమే ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే చివరిగా రజినీకాంత్ మణిరత్నం దర్శకత్వంలో ‘దళపతి’ మూవీ చేశారు. ఈ సినిమాలో మమ్ముట్టి మరో పాత్రలో నటించారు.
మహాభారతం ఆధారంగా చేసుకొని ఈ మూవీ కథని మణిరత్నం తెరకెక్కించారు. ‘దళపతి’ రజినీకాంత్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ తెరకెక్కనుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కూడా రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
This post was last modified on October 17, 2024 11:08 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…