Movie News

డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది

కావ్య థాపర్.. ‘ఏక్ మిని కథ’ అనే చిన్న సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ. నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ఆ సినిమా మంచి స్పందనే తెచ్చుకుంది. ఆ చిత్రంలో చాలా వరకు కావ్య ట్రెడిషనల్ లుక్స్‌లోనే కనిపించింది కానీ.. ఒక పాటలో అందాల ఆరబోతతో యూత్ దృష్టిని ఆకర్షించింది. బహుశా ఆ పాటే తనకు తర్వాత అవకాశాలు తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు. తెలుగులో వరుసగా ఆమెకు మంచి మంచి సినిమాలు పడ్డాయి. కానీ ఆ సినిమాలు వరుసగా ఫెయిలవుతుండడంతో కావ్య కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో కావ్య నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఏడాది ఆరంభంలో రవితేజ సరసన ‘ఈగల్’ లాంటి క్రేజీ మూవీలో నటించింది కావ్య. అందులో గ్లామర్‌తో పాటు నటనకూ స్కోప్ ఉన్న పాత్ర చేసింది కావ్య. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది.

ఇంకో వారానికే కావ్య నటించిన మరో చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ వచ్చింది. అందులో ఆమె గ్లామర్ రోల్ చేసింది. కానీ అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’లోనూ కావ్యనే హీరోయిన్. అందులో ఆమె సూపర్ సెక్సీగా కనిపించింది. పూరి జగన్నాథ్ హీరోయిన్లను మామూలుగానే చాలా గ్లామరస్‌గా చూపిస్తాడు. కావ్య కెరీర్లో మరే చిత్రంలోనూ చేయనంత ఎక్స్‌పోజింగ్ ఈ సినిమాలో చేసింది. కానీ దాని వల్ల ఫలితం లేకపోయింది. ‘డబుల్ ఇస్మార్ట్’ పెద్ద డిజాస్టర్ అయింది.

ఇక కావ్య నుంచి లేటెస్ట్‌గా ‘విశ్వం’ మూవీ వచ్చింది. ఇందులోనూ తనది గ్లామర్ రోలే. ఏ లిమిటేషన్స్ పెట్టకుండా యూత్‌ను ఆకట్టుకునేలా కావ్య చాలా సెక్సీగా కనిపించే ప్రయత్నం చేస్తున్నా.. సినిమాలకు వీలైనంత మేర ప్లస్ అవుతున్నా.. ఆమె నటించిన సినిమాల్లో విషయం లేకపోవడం వల్ల ప్రతిసారీ ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. సినిమాలో కంటెంట్‌తో హీరోయిన్లకు ఏ సంబంధం లేకున్నా.. వరుసగా ఫెయిల్యూర్లు వచ్చాయంటే ఒక నెగెటివ్ ముద్ర పడిపోతుంది. కావ్య కూడా ఇప్పుడు అదే నెగెటివిటీని ఎదుర్కొంటోంది.

Share

Recent Posts

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

2 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

1 hour ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago