ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన సినిమా.. గుంటూరు కారం. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మూవీకి ఓపెనింగ్స్ బాగానేే వచ్చినా.. వీకెండ్ తర్వాత నిలబడలేకపోయింది. ‘హనుమాన్’ జోరు ముందు వెలవెలబోయి.. అంతిమంగా ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. ఐతే ఈ సినిమాను తాము ప్రమోట్ చేసే విషయంలో తప్పు చేశామని గతంలోనే నిర్మాత నాగవంశీ అభిప్రాయపడ్డాడు.
‘గుంటూరు కారం’ ఫ్యామిలీ నచ్చే క్లాస్ సినిమాగా ప్రమోట్ చేయాల్సిందని ఆయన అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘గుంటూరు కారం’ విషయంలో జరిగిన తప్పు గురించి నాగవంశీ మాట్లాడాడు. ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ పెట్టాల్సింది కాదన్నాడు నాగవంశీ. ఈ టైటిల్ చూసి ఇది పక్కా మాస్ మూవీ అనే అభిప్రాయంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి.. సినిమా అలా లేకపోవడంతో నిరాశ చెందారన్నాడు.
నిజానికి ‘గుంటూరు కారం’ త్రివిక్రమ్ మార్కు క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. సినిమాను అలాగే ప్రమోట్ చేయాల్సిందని నాగవంశీ అన్నాడు. అలాగే పెద్ద సినిమాలకు మిడ్ నైట్ ప్రిమియర్స్ వేసే విషయంలో మేకర్స్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నాగవంశీ అభిప్రాయపడ్డాడు. మిడ్ నైట్ ప్రిమియర్స్ ఎక్కువగా ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకులు చూస్తారని.. మాస్ సినిమా అయితే ఎంజాయ్ చేస్తారని.. క్లాస్ మూవీ అయితే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని నాగవంశీ అన్నాడు.
క్లాస్ సినిమాకు కొంచెం లేటుగా ప్రిమియర్స్ వేస్తే వాటిని ఇష్టపడే ప్రేక్షకులు రిలాక్స్డ్‌గా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని.. ఫీడ్ బ్యాక్ కూడా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ రోజుల్లో యుఎస్ ప్రిమియర్స్ నుంచి వచ్చే టాక్‌కు విలువ లేకుండా పోయిందని నాగవంశీ అన్నాడు.
గుంటూరు కారం, సలార్, దేవర లాంటి చిత్రాలకు ప్రిమియర్స్ నుంచి మిక్స్డ్ టాకే వచ్చిందని.. అయినా కూడా వాటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని.. కాబట్టి యుఎస్ ప్రిమియర్ రివ్యూలు, టాక్‌ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థమవుతోందని నాగవంశీ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on October 16, 2024 4:38 pm
జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్…
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్…
"వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే.. ఇది నా పంతం" అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఫైర్‌బ్రాండ్ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో పవన్…
రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చర్చిస్తున్న…
ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం…