లైగర్ సినిమా తేడా కొట్టినా పూరి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పక్కా హిట్టవ్వాలి అని చాలా టైమ్ తీసుకొని మరి స్క్రిప్ట్ రాసుకున్నాడు. కానీ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా పూరి ఒక కథను వారంలో ఫినిష్ చేయగల సమర్థుడు. కానీ ఇటీవల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నా కూడా మినిమమ్ హిట్టు పడడం లేదు.
ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు ఎ హీరోతో సినిమా చేస్తాడు అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య హనుమాన్ నిర్మాతతో ఒక సేఫ్ బడ్జెట్ లో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ కు డిస్ట్రిబ్యూటర్ గా రిస్క్ చేసిన నిరంజన్ రెడ్డి భారీగా నష్టపోయారు.
దీంతో పూరి ఆయనకు మాట అయితే ఇచ్చారు. తేజ సజ్జా లాంటి హీరోతోనే సినిమా చేయనున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇక ఆ తరువాత సిద్ధు జొన్నలగడ్డ, శర్వా లాంటి వారి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఊహించని విధంగా పూరి అడుగు అక్కినేని కాంపౌండ్ లో పడినట్లు తెలుస్తోంది.
అసలే ఇటీవల సక్సెస్ లేక అక్కినేని హీరోలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక పూరి చూపు అక్కడ ఎవరిపై పడిందనేది మిస్టరీగా మారింది. అఖిల్ కోసమే ఒక కథ సెట్ చేసినట్లు గతంలో కూడా కథనాలు వచ్చాయి. కానీ సురేందర్ రెడ్డి ఇచ్చిన ఏజెంట్ షాక్ నుంచి అఖిల్ ఇంకా బయటకు రాలేదు. ఇలాంటి టైమ్ లో పూరిని నమ్ముతాడా అనేది మరో బిగ్ మిస్టరీ. నాగచైతన్య, నాగ్ కూడా ప్రస్తుతం ఖాళీగా లేరు. మరి పూరి అఖిల్ ను ఒప్పిస్తాడో లేదో చూడాలి. అఖిల్ అయితే నెక్స్ట్ UV లో ఒక కొత్త డైరెక్టర్ సినిమాకోసం సిద్ధం అవుతున్నారు.
This post was last modified on October 17, 2024 9:53 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…